చందుభాయ్ వారి ది డైమండ్ స్టోర్ 22,000కు పైగా సహజ వజ్రాలు మరియు నవరత్నాలతో రూపొందించిన ఏడు భాగాల వారసత్వ అద్భుత కళాఖండాన్ని ఆవిష్కరించింది
హైదరాబాద్, డిసెంబర్ 17, 2025: హైదరాబాద్‌కు చెందిన చందుభాయ్ వారి ది డైమండ్ స్టోర్, ప్రాచీన భారతీయ రాజ సంప్రదాయాల నుండి ప్రేరణ పొందిన ఒక అద్భుతమైన ఆభరణాల సృష్టిని ఆవిష్కరించింది. చారిత్రాత్మక "ఏడు వారాల నగలు"కు ఆధునిక రూపంగా రూపొందించిన ఈ ఏడు భాగాల వజ్రాలు మరియు నవరత్నాల కళాఖండాన్ని 22,000 సహజ వజ్రాలు మరియు అసలైన నవరత్న రాళ్లతో తయారు చేశారు.
శతాబ్దాల నాటి ‘ఏడువారాల నగలు’సంప్రదాయాన్ని ఈ అసాధారణ ఆభరణం తిరిగి ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఒక వారంలోని ఏడు రోజుల్లో ఒక్కోరోజు ఒక్కో ఆభరణాన్ని రాజకుటుంబాలకు చెందిన మహిళలు ధరించేవారు.
ఇందులోని ప్రతి అంశం ఒక ప్రత్యేక సంకేతాత్మక కథను చెబుతుంది. ఏనుగులు, సింహాలు, హంసలు, వృక్షవల్లులు, పుష్పాల అలంకారాలు బలం, ధైర్యం, పరిశుద్ధత, అభివృద్ధి, సంతానసంపత్తి, పరిణామాన్ని సూచిస్తాయి. ఆలయ శిల్పకళ, సూక్ష్మ చిత్రకళ, భారతీయ రాచరిక ఆభరణాల వైభవాన్ని తలపించేలా ఈ ఆభరణంలోని సూక్ష్మ నైపుణ్యం ప్రతిబింబిస్తుంది.
ఇందులో ప్రధాన ఆకర్షణ.. శాస్త్రోక్త క్రమంలో అమర్చిన పవిత్ర నవరత్న సముచ్చయం. ప్రాచీన గ్రంథాల్లో పేర్కొన్న జ్యోతిష్య క్రమానుసారం మాణిక్యం, ముత్యం, పగడం, పచ్చ, పుష్యరాగం, వజ్రం, నీలం, గోమేధికం, వైడూర్యం ఈ తొమ్మిది రత్నాలను అమర్చారు. ఈ రత్నాలు దివ్య శక్తులను సమకూరిన సమతుల్యత, రక్షణ, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయని విశ్వాసం. సమకాలీన ఆభరణాల్లో అరుదుగా దర్శనమిచ్చే ఈ క్రమబద్ధమైన అమరిక, ఈ నగల సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను మరింత పెంచింది.
ఈ ఆభరణాల్లో ఉపయోగించిన సహజ వజ్రాలను జాగ్రత్తగా ఎంపిక చేసి, అలంకారాల మధ్య సమతుల్యతతో అమర్చారు. ఏడు నగలలో ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన నిర్మాణం, రత్నాల అమరికతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. విడిగా ధరించినా, అన్నింటినీ కలిపి ధరించినా ఈ ఆభరణం తన రాచరిక వైభవాన్ని నిలబెట్టుకుంటుంది.
దక్షిణ భారతదేశానికి చెందిన ప్రతిష్ఠాత్మక కుటుంబానికి చెందిన వధువు తన వంశపారంపర్య గౌరవార్థంగా ఈ ఆభరణాన్ని ఎంపిక చేసుకుంది. పరిశుద్ధత, సంపద, నిరంతరత అనే విలువలను ప్రతిబింబించేలా ఈ డిజైన్ రూపుదిద్దుకుంది. తరతరాలకు అందించే ప్రత్యేక వారసత్వ ఆభరణంగా దీన్ని రూపొందించారు. వేగంగా మారుతున్న ధోరణులను అనుసరించే వధూ నగల మధ్య, ఈ నగలు.. వారసత్వం, ఆధ్యాత్మికత, కార్మిక నైపుణ్యం, సాంస్కృతికతలతో ప్రత్యేక స్థానాన్ని సాధించాయి. ఇది కేవలం ఆభరణం కాదు, భారత రాజరిక వారసత్వానికి జీవనిధి. ఈ రూపకల్పనను పునరావృతం చేయకుండా, ఒకే కుటుంబానికి చెందిన ప్రత్యేక సంపదగా నిలిపి ఉంచాలని సంస్థ నిర్ణయించింది.
ఈ ఏడువారాల నగల రూపకర్త, ‘ది డైమండ్ స్టోర్ బై చందుభాయ్’ యజమాని కొట్టి శ్రీకాంత్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘భారతదేశ సాంస్కృతిక సంపదకు గౌరవ సూచకంగా ఈ ఆవిష్కరణ చేపట్టాము, బలం, ఐశ్వర్యం, దైవ సమతుల్యతను ప్రతిబింబించే ‘ఏడు వారాల నాగలు’ సంప్రదాయాన్ని సజీవంగా నిలిపే ఉద్దేశంతో దీన్ని ఆవిష్కరించాం, దశాబ్దాల అనుభవం, నైపుణ్యాన్ని ఈ కళాఖండంలో నింపాము, దీనికి వస్తున్న స్పందన మమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తోంది’’ అని ఆయన వెల్లడించారు.
2020లో ఒకే ఉంగరంలో అత్యధిక వజ్రాలను అమర్చిన ఘనతతో గిన్నిస్ వరల్డ్ రికార్డును కొట్టి శ్రీకాంత్ గారు సాధించారు. ఒకే ఉంగరంలో 7,801 సహజ వజ్రాలను అమర్చిన తొలి దక్షిణ భారతీయుడిగా ఆయన గుర్తింపు పొందారు. మాన్యువల్ జ్యువెలరీ డిజైనింగ్‌లో డిప్లొమా, ముంబయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జ్యువెలరీ నుంచి కంప్యూటర్ ఆధారిత ఆభరణాల రూపకల్పనలో డిప్లొమా, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తిచేసిన ఆయన, అమెరికాలోని జెమోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెరికా నుంచి సర్టిఫైడ్ డైమండ్ గ్రాడ్యుయేట్ అర్హతను కూడా సంపాదించారు.
Информация по комментариям в разработке