Chandranna Pelli Kanuka Scheme

Описание к видео Chandranna Pelli Kanuka Scheme

నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహం భారం కాకూడదనే ఉద్దేశ్యంతో రూపొందించిన పథకమే 'చంద్రన్న పెళ్లి కానుక'. దేశంలోనే తొలిసారిగా విస్తృత స్థాయిలో ఈ పథకాన్ని అమలు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. క్షేత్ర స్థాయిలో లబ్దిదారుల ఎంపిక, సహకార బాధ్యతలను కల్యాణ మిత్రలకు అప్పగించి, వారికి పూర్తిస్థాయి శిక్షణను అందిస్తున్నారు. ఈ పథకం కింద లబ్ది పొందదలచినవారు www.chpk.ap.gov.in వెబ్ సైట్ లో పూర్తి వివరాలు పొందవచ్చు.
కల్యాణ మిత్రల క్షేత్ర సందర్శన తర్వాత వధూవరుల వివరాలు వాస్తవమని నిర్దారణ అయితే మొత్తం కానుకలో 20 శాతం వివాహానికి ముందే విడుదల చేస్తారు. మిగిలిన నగదును పెళ్లిరోజు వధువు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.

ఈ పథకం ద్వారా సామాజికంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
పేద కుటుంబానికి ఆర్థిక వెసులుబాటు కలగడం మాత్రమే కాకుండా వధువుకు వివాహ భద్రతను అందిస్తుంది.

వయసు నిర్ధారణ ద్వారా బాల్యవివాహాలను నిర్మూలించవచ్చు.
వివాహాల రిజిస్ట్రేషన్ ద్వారా వధువు వైవాహిక జీవితానికి రక్షణ కల్పించవచ్చు.
భవిష్యత్తులో పదో తరగతి విద్యార్హతను ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది. తద్వారా బాలికా విద్యను సైతం ప్రోత్సహించవచ్చు

Комментарии

Информация по комментариям в разработке