Book Study_009 | Bible Intro_09 | Bro. N. Joseph Karuna

Описание к видео Book Study_009 | Bible Intro_09 | Bro. N. Joseph Karuna

1947లో స్వాతంత్రం వచ్చాక, మన దేశ మొదటి ప్రధాన మంత్రి Pandit Jawaharlal Nehru గారు. మన దేశంలో వున్న Bishops & cardinalsకి పిలుపునిచ్చారు ఏమని? ఆధునిక భారతదేశ నిర్మాణంలో పాలిభాగస్తులుకండి. విద్య, వైద్యం, సామజిక, ఆర్ధిక విషయాలలో దేశ పురోగతి కొరకు మీ సహకారం కావాలని కోరారు.
(Silent Waves - John Chathanatt, SJ Dr. Jaya Peter)...

బ్రిటిష్ ప్రభుత్వం మన దేశాన్ని దోచుకుంది కానీ, క్రైస్తవ మిషనరీలు మరియు బైబిల్ సేవకులు మన దేశాన్ని నిర్మించారు.

అందుకే బ్రిటిష్ ప్రభుత్వాన్ని, అధికారులను దేశం నుంచి తరిమేశారు కానీ, క్రైస్తవ మిషనరీలను హత్తుకున్నారు. దేశ నిర్మాణములో పాలి భాగస్తులుగా ఉండాలని కోరారు.

IAS Officer, కత్తి చంద్రయ్య గారు ప్రభువు యొక్క దైవభావం గాని మానవుల యొక్క సోదర భావం కానీ, క్రీస్తు మతంలో చెప్పినట్లుగా మరే మతంలోనూ నొక్కి చెప్పలేదు. అందుకే అది దళితుల, నిమ్న జాతుల, దాడిత, పీడితుల మతం అయింది అన్నారు.

క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి ఏమి పరిచయం చేశారో చూద్దాం:
1. తపాలా వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు .
2. నదీ జలాలను బ్యారేజీల ద్వారా నిలువ చేసి పొలాలకు ఆ నీటిని మళ్లించి కరువులను నివారించారు…(Ex: ధవళేశ్వరం ఆనకట్ట - Sir Arthur Cotton Barrage or Godavari Barrage)
3. విలియం కేరి మరియు అతని జత పనివారు కలిసి డబ్బు పొదుపు చేసుకోవడానికి 1819లో సేవింగ్ బ్యాంక్ ప్రారంభించారు.
4. Marshman ఆధ్వర్యంలో steam engine తో నడిచే పేపర్ మిల్లు 1820లో స్థాపించబడింది.
5. క్రైస్తవ మిషనరీ మెకాలే(macaulay) ఇండియన్ పీనల్ కోడ్ ని రూపొందించాడు.
6. ముద్రణ యంత్రం.
7. పోస్ట్ ఆఫీస్ వంటి గొప్ప సదుపాయాలు తెచ్చారు.

Amy Carmichael(Christian missionary in India) received a letter from a young lady who was considering life as a missionary, asking, "What is missionary life like?" Carmichael wrote back, "Missionary life is simply a chance to die.

వీడియోలో చెప్పనటువంటి మరి కొన్ని ఆశక్తికరమైన విషయాలు ఈ క్రింద భాగంలో మీరు కనుగొనవచ్చు.

వైద్యరంగం:
Waldemar Mordecai Haffkine: ANTI-CHOLERA INOCULATION
Medical journals of repute, like Lancet and the Indian medical gazette hailed the discovery as an important landmark in medical history.

మేరీ బ్రౌన్(Edith Mary Brown) భారతదేశానికి మిషనరీగా 9th December 1891లో వచ్చింది. ఇక్కడ ఉన్న మహిళల పరిస్థితులను చూసి మహిళల యొక్క దయనీయమైన స్థితిని చూసి ఆశ్చర్యపోయింది. మహిళలను బాలికలను విద్యావంతులను చేయడం మాత్రమే కాకుండా రోగులకు 1894లో, ఒక ఆసుపత్రిని కూడా నిర్మించింది.. పంజాబ్(Punjab)లో edith మేరీ బ్రౌన్ 44 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఆ ఆసుపత్రి ప్రస్తుతం అనేకమందికి విద్యను వైద్యాన్ని అందిస్తుంది.. “Christian Medical College Ludhiana”

ఆనాడు ఆరోగ్య సూత్రాలను ప్రజల్లో ప్రచారం చేయడం కోసం సంవత్సరానికి ఒకసారి ఆరోగ్య వారం జరిపేవారు ఆ వారం రోజులు మిషనరీలు డాక్టర్ల సహాయంతో వివిధ గ్రామాలకు వెళ్లి ఆరోగ్య సూత్రాలను ప్రజలకు తెలియజేసేవారు దీనికి తార్గాణంగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో క్రైస్తవ మిషనరీల వైద్యాలయాన్ని ఆరోగ్యవరం అని పిలవడం నేటికీ ఉంది

సతీసహగమనం:

విలియం కెరీ కంటే ముందే కొందరు మిషనరీలు దీనిని అరికట్టడానికి వినతి పత్రాలు సమర్పిస్తూ 1772 నుండే ప్రయత్నాలు చేపట్టారు…

1812, ఫిబ్రవరిలో ముర్షిదాబాద్ దగ్గరలోని సైదాబాద్ లో 13 మంది భార్యలు కలిగిన ఒక వ్యక్తి చనిపోయాడు ఆయనకు 81 సంవత్సరాలు, ఆ 13 మంది విధవరాళ్లను ఆయనతోపాటు దహనం చేశారు. వీరి సంతానమైన 19 మంది కుమారులు 13 కుమార్తెలు అనాదులుగా మిగిలిపోయారు..

శిశు హత్యలు

హుగ్లీ నది ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో ఆ ప్రాంతంలోకి పిల్లలను తోసేసేవాళ్ళు వారు మునిగిపోయే వాళ్ళు లేదా ముసళ్ళు వచ్చి వారిని తినేసేవి. దేవతలను శాంతింప చేయడానికి లేదా పాపాల ప్రాయశ్చితానికి తల్లితండ్రులే తమ ఆడ శిశువులను బలి ఇవ్వడానికి నదులలో విసిరిపారేసేవారు.

గంగా నదిని పవిత్రమైన నదిగా భావించేవారు, గంగా నదిలో తమ పిల్లలను విసిరేసినటువంటి తల్లులను గొప్ప భక్తులుగా కొనియాడేవారు…

విలియం కేరి ఈ శిశు హత్యల దురాచారాన్ని నివారించే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశాడు తద్వారా August 1802లో చట్టపరంగా దీన్ని నిషేధించారు.

ఆత్మ బలిదానాలు
ఒరిస్సాలో ఒక దేవాలయం ఉండేది అక్కడ రథాన్ని ఊరేగించేవారు భక్తులు ఆ రథ చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోవడానికి ఇష్టపడేవారు 18వ శతాబ్దపు ఒరిస్సా మిషనరీ అయినా జేమ్స్ పెగ్స్ ఇలా రాశాడు ఆ రథము వాళ్ళ మీద నుండి వెళ్ళిపోయిన పిమ్మట వారి నడుము మెడ చేతులు కాళ్లు నుజ్జు నుజ్జు అయి ముక్కలు ముక్కలుగా పడి ఉండేవి & వాటిని కుక్కలు పీక్కొని తినేవి…

సామూహిక ఆత్మహత్యల పరంపర కూడా ఉండేది గంగానది ఎంతో పవిత్రమైనదిగా భావించిన కారణంగా గంగానది మధ్యకు పోయి దూకి చనిపోయినట్లయితే పుణ్యమని భావించి ప్రతి ఏటా సుమారు 50 వేల మంది గంగా నదిలో దూకి చనిపోయేవారు

నరబలులు :
మన దేశంలో నరబలులు అర్పించే కొన్ని తెగల ప్రజలు ఉన్నారు. గోండు, కోయ, ముండా & సంతాల్ తెగల ప్రజలు నరబలులు అర్పించేవారు… క్రైస్తవ మిషనరీలు వీరిని మచ్చిక చేసుకుని విద్య నేర్పించి సామాజిక మార్పులు తీసుకొచ్చి వీరిలో గొప్ప మార్పును తీసుకొచ్చారు.
1837 కి ముందు తూర్పు మధ్య భారత దేశ ప్రాంతాలలో ప్రతి సంవత్సరం 150 మంది నరబలులు సమర్పించబడేది.ఈ ఆచారాన్ని కూడా హార్డింగ్ అరికట్టాడు..

ఈ గోండు జాతి ప్రజల్లో క్రైస్తవ మిషనరీలు 1861 నుండి పరిచర్యను ప్రారంభించారు తమ జాతి మినహా మరే ఇతర జాతివారైనా కనిపిస్తే వెంటనే తీసుకెళ్లి బలి ఇచ్చే ఈ అత్యంత భయంకరమైన వారికి ఆధునిక విద్యను ప్రవేశపెట్టి నాగరికతను రుచి చూపించి వారిలో మార్పు తీసుకొచ్చారు

1795 - 1802 వరకు నరబలులను నిషేధిస్తూ చట్టాలు చేసి వాటిని కఠినంగా అమలుపరచిన వారు విలియం బెంటిక్ & హార్డింగ్…

#biblehistory #Christianmissionaries #TeluguBibleStudy #BibleIntro #teluguchristianmessages

Комментарии

Информация по комментариям в разработке