#ts cyber crime
#cyber crime videos
#cyber crime complaint process
#ts
https://youtube.com/@sknews7566?si=Gq...
http://Cybercrime.gov.in/webform/crim...
ఫిర్యాదు ఎలా?
ttps://www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో మీ మొబైల్ నంబర్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలి. ఆ ప్రయత్నంలో ఓటీపీ ద్వారా రిజిస్టర్ కావాలి. ఆ తర్వాత ఫిర్యాదు ఏ కేటగిరి కిందికి వస్తుందో తెలుసుకోవాలి. మహిళలు, పిల్లలకు సంబంధించిన విభాగంలో.. చైల్డ్ అబ్యూజ్, లైంగిక వేధింపులు, అసభ్యకర కంటెంట్ (ఫొటో, వీడియో ఇతరాలు) ఉంటాయి. ఇతర సైబర్ నేరాల విషయానికొస్తే.. మొబైల్, ల్యాప్‌టాప్ వంటి గ్యాడ్జెట్స్ నేరాలు, సోషల్ మీడియా నేరాలు, ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు, సైబర్ ట్రాఫికింగ్, రాన్సమ్‌వేర్, హ్యాకింగ్ వంటి విభాగాలు ఉంటాయి. సంబంధిత విభాగాన్ని ఎంచుకొని ఫిర్యాదు చేయాలి. నేరాన్ని నివేదించే క్రమంలో.. నేరం జరిగిన వేదిక (ఇంటర్నెట్, వాట్సాప్) తేదీ, సమయం, సంబంధిత సాక్ష్యాలు, ఆర్థికపరమైన మోసాలకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, లైంగిక వేధింపులకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు, ఫొటోలు, వీడియోలు, ఆడియోలు వంటివి
జతచేయాలి. వీటితోపాటుగా అనుమానితుడి వివరాలు (అందుబాటులో ఉంటే), ఫిర్యాదుదారుల వివరాలు సైతం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమాచారంతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
వివరాలు గోప్యం
సైబర్ నేరాల విషయంలో చాలామంది ఫిర్యాదు చేయడానికి జంకుతున్నారు. ‘నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారో’ అనే భయమే ప్రధాన కారణం. దీంతో నేరగాళ్లకు ధైర్యం వచ్చేస్తున్నది. అయితే, ఇక్కడ ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతారు. అసలు బయటపెట్టరు. అర్థంలేని భయాలతో కాలాన్ని వృథా చేయకుండా.. నేరం జరిగిన వెంటనే ఆన్‌లైన్‌లో కానీ, ఆఫ్‌లైన్‌లో కానీ ఫిర్యాదు చేయడం ఉత్తమం. పరువునష్టం కలిగించినా, బెదిరించినా, మొబైల్ ఫోన్, కెమెరా ద్వారా వ్యక్తిగత జీవితాన్ని చిత్రీకరించినా, సైబర్ స్టాకింగ్‌కు పాల్పడినా, డేటా దొంగిలించినా, గ్యాడ్జెట్స్ హ్యాకింగ్ చేసినా, సైబర్ టెర్రరిజానికి పాల్పడినా.. మీ దగ్గర ఉన్న సమాచారంతో ఫిర్యాదు చేయండి.
మీ కోసమే I4C స్కీమ్..
సత్వర న్యాయం, ఉపశమనం కోసం సర్కారు ప్రవేశపెట్టిన పథకం ‘ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C)’. సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను చట్టబద్ధంగా అమలు చేసేఏజెన్సీలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలను ఒక తాటిపైకి తీసుకురావడానికి ‘ఐ4సీ’ని రూపొందించారు. ఇది ప్రస్తుతం ఏడు రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలులో ఉంది. ఆన్‌లైన్ మోసాల్లో డబ్బు కోల్పోయినప్పుడు తక్షణ రికవరీకి ఈ విభాగం తోడ్పడుతుంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ద్వారా జరిగే మోసాల్ని బ్యాంకులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్తుంది. ఆన్‌లైన్‌లో బాధితులు కోల్పోయిన డబ్బును ‘డిజిటల్ ఎకో సిస్టమ్’ నుంచి బయటికి తీయకముందే.. తదుపరి మోసాన్ని అడ్డుకునే సాంకేతిక వ్యవస్థ ఇది.
డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్
డిజిటల్ మీడియా రాకతో గోప్యతకు ముప్పు వాటిల్లుతున్నది. ఇష్టారీతిన చెడు ప్రచారం చేస్తున్నారు. పరువునష్టం కలిగిస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఇవన్నీ పంటికింద రాయిలా మారాయి. దీంతో ‘డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్-2021’ పేరుతో కొన్ని మార్గదర్శకాలను ప్రవేశ ప్రవేశపెట్టారు. వీటిని అనుసరించి సైబర్ క్రైమ్ పోలీసులు డిజిటల్ మీడియా సంస్థలు, వ్యక్తులపై వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. మీరు కూడా డిజిటల్ మీడియా బాధితులైతే వెంటనే సైబర్ క్రైమ్ విభాగాన్ని ఆశ్రయించవచ్చు. తక్షణం చట్టవిరుద్ధ,
అనైతిక, అశ్లీల సమాచారాన్ని, లింకులను తీసేస్తారు. సంబంధిత నోడల్ అధికారుల మద్దతుతో సత్వర పరిష్కారమూ అందిస్తారు.
Информация по комментариям в разработке