ట్రంప్‌కు భారీ ఊరట | Big Relief For Donald Trump | Immunity For Official Acts | US Supreme Court

Описание к видео ట్రంప్‌కు భారీ ఊరట | Big Relief For Donald Trump | Immunity For Official Acts | US Supreme Court

2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను మార్చేందుకు యత్నించారనే అభియోగాలను ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ నకు ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. నేరాభియోగాల విచారణల నుంచి మాజీ అధ్యక్షులకూ మినహాయింపు ఉంటుందని సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును 9 మందితో కూడిన ధర్మాసనంలో ఆరుగురు న్యాయమూర్తులు సమర్థించారు. అమెరికా రాజ్యాంగం అనుసరించి అధ్యక్షునికి ఉన్నట్లే మాజీ అధ్యక్షునికి నేరాభియోగ విచారణ నుంచి సంపూర్ణ మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని ముగ్గురు న్యాయమూర్తులు వ్యతిరేకించారు. కోర్టు నిర్ణయంతో నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికలలోపు న్యాయస్థానాల్లో ట్రంప్ ను విచారించే అవకాశాలు ఉండవు. బాలెట్ పత్రాల్లో ట్రంప్ పేరు చేర్చవద్దన్న కింది కోర్టు తీర్పును నిలిపివేసిన తర్వాత ట్రంప్ నకు అనుకూలంగా సర్వోన్నత న్యాయస్థానంలో వెలువడిన మరో తీర్పు ఇది. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన ట్రంప్.. మన రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఇది భారీ విజయమని హర్షం వ్యక్తం చేశారు. అమెరికా పౌరుడిగా గర్విస్తున్నానని వివరించారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке