"బుద్బుదం" రావి శాస్త్రి గారి రచన

Описание к видео "బుద్బుదం" రావి శాస్త్రి గారి రచన

మనం వినబోయే కథ "బుద్బుదం "....రచయిత రావి శాస్త్రిగా ప్రసిద్ధి చెందిన కీ. శే.రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు. తెలుగు కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన మహా రచయిత. మానవ జీవితంలోని కష్టాలను చాలా స్పష్టంగా చూపిస్తూ రచనలు చేసిన ప్రజల రచయిత రావి శాస్త్రి గారు. ఆయన రచనలు సాహిత్య సృష్టి కోసం చెయ్యలేదు. శ్రీ శ్రీ కవిత్వంలోని పతితులు , భ్రష్టులు, బాధా సర్పదష్టుల్ని ...వారి జీవితాల్ని తన కథాంశాలుగా చేసుకుని వారి బాధల్ని లోకం దృష్టికి తీసుకు వెళ్ళడానికి మాత్రమే రచనలు చేసిన నిజమైన న్యాయవాది. వృత్తి...ప్రవృత్తి కూడా న్యాయం కోసం...ధర్మం కోసం ప్రజాపక్షం వహించి పోరాడడమే ఆయన లక్ష్యం. ఆయన రచనా శైలి గమనిస్తే....ఉపమానాలు అమితంగా కనపడతాయి.అందువల్లే శ్రీ రమణ గారు ఆయన్ని "ఉపమా రాచకొండస్య " అని చమత్కరించారు. వారి ఇతర రచనలు కథల్లో....ఋక్కులు, ఆరు సారా కథలు , ఆరు సారో కథలు, బాకీ కథలు. నవలలు అల్పజీవి , రాజు-మహిషి , రత్తాలు రాంబాబు , గోవులొస్తున్నాయి జాగ్రత్త....మరి కొన్ని. విశాఖ సాగర తీరంలో వారి విగ్రహాన్ని ఉదయపు నడకలో అనేకమార్లు సందర్శించుకుని నమస్కరించుకున్న అదృష్టం నాది. ప్రతి ఏడాది వారి కుటుంబ సభ్యులు , వారి జూనియర్స్ వారి పుట్టినరోజు జులై 30 న బీచ్ రోడ్డులోని వారి విగ్రహం వద్ద నిర్వహిస్తారు. రావిశాస్త్రి రచనా పురస్కారం అందజేస్తారు. 2019 లో శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారికి రావిశాస్త్రి గారి రచనా పురస్కారం లభించినప్పుడు ఆ సభలో వారి కుమారుడు శ్రీ ఉమా కుమారశాస్త్రి గారు ఇతర కుటుంబ సభ్యుల్ని కలుసుకునే అవకాశం కలిగింది. చివరిగా రచయితగా ఆయన లక్ష్యమూ , దృక్పధమూ ఆయన మాటల్లోనే చెప్పి ముగిస్తాను. "రచయిత ప్రతివారూ తాను రాస్తున్నది ఏ మంచికి హాని కల్గిస్తుందో , ఏ చెడ్డకి ఉపకారం చేస్తోందో ఆలోచించ వలసిన అవసరం ఉందని నేను భావిస్తాను " అంటారు. 💐💐వినండి ఈ వారం కథ "బుద్బుదం" రావి శాస్త్రి గారి రచన. 🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd AGM Indian Bank Vijayawada

Комментарии

Информация по комментариям в разработке