వడగళ్ళు కథ ||అడవి బాపిరాజు || కథాపఠనం ఆకుల మల్లేశ్వర రావు ||Telugukavi || kodamkumarkavi || Nijam

Описание к видео వడగళ్ళు కథ ||అడవి బాపిరాజు || కథాపఠనం ఆకుల మల్లేశ్వర రావు ||Telugukavi || kodamkumarkavi || Nijam

Created by #తెలుగుకవి
#AdaviBapiraju
#అడవిబాపిరాజు
#వడగళ్లు_కథ
#తెలంగాణ_నైజాం పోరాటకాలం_కథ
ప్రజలు
#పల్లెబతుకు
#hyderabadstate,

అడివి బాపిరాజు (అక్టోబరు 8, 1895 - సెప్టెంబరు 22, 1952) బహుముఖ ప్రజ్ఞాశీలి, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటక కర్త. చిన్నతనం నుంచే సాహిత్యంపై ఆసక్తి చూపేవాడు. 1922 లో భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని అరెస్టయినాడు. జైలులో ఉండగా శాతవాహనుల నేపథ్యంలో సాగే హిమబిందు అనే నవల ప్రారంభించాడు. బందరు జాతీయ కళాశాలలో ప్రమోద్ కుమార్ ఛటోపాధ్యాయ దగ్గర శిష్యరికం చేసి భారతీయ చిత్రకళలో నైపుణ్యం సాధించాడు. తిక్కన, సముద్ర గుప్తుడు లాంటి చిత్రాలు గీశాడు. భీమవరంలో న్యాయవాద వృత్తి చేస్తూ నారాయణరావు అనే సాంఘిక నవల రాశాడు. ఈ నవలకు ఆంధ్రవిశ్వకళాపరిషత్తు వారి బహుమతి లభించింది. 1934 నుంచి 1939 వరకు బందరు జాతీయ కళాశాల ప్రధానాచార్యుడిగా పనిచేశాడు. అదే సమయంలో కథలు రాశాడు. 1939 లో సినీరంగప్రవేశం చేసి అనసూయ, ధ్రువ విజయం, మీరాబాయి లాంటి సినిమాలకు కళాదర్శకత్వం చేశాడు. 1944 నుంచి 1947 వరకు హైదరాబాదునుంచి వెలువడే మీజాన్ పత్రికకు సంపాదకత్వం వహించాడు. ఈ సమయంలో తుఫాను, గోన గన్నారెడ్డి, కోనంగి నవలలు రచించాడు. 1952 సెప్టెంబరు 22 న మద్రాసులో కన్నుమూశాడు.

వడగల్లు కథ అడవి బాపిరాజు రాసినటువంటి అడవి బాపిరాజు ప్రముఖ నవల కథ రచయిత. ఇందులో కథానాయకుడు పతంజలి ఓరుగల్లు జిల్లా జనగామ జన్మభూమిగా ఉన్నట్లు ఖతా రచయిత చిత్రించారు. అదేవిధంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1948 ప్రాంతంలో కాసిం రాజీవి పోలీస్ సైనిక చర్య తదితర అంశాలు ఈ కథలో చర్చకు వస్తాయి. కథలో ప్రధానంగా వడగల్లు కథానాయకుడు తన ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు అంతకుముందే జైలుకు వెళ్లి వచ్చి ఉంటాడు అటు తర్వాత కూడా జైలు పాలవుతాడు ఈ కథలో ప్రధానంగా జనగామ కేంద్రంగా ఉన్నటువంటి కథ. కథ రచయిత సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వాడు కావడం వల్లనే తెలంగాణ జీవితాన్ని ముఖ్యంగా జనగామ ప్రాంతాన్ని ఆ ప్రాంత యువకుని మనోభావాలను ఎట్లా చిత్రీకరించారు. ఒక 70 ఏళ్ల క్రితం అనేటువంటిది ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైనటువంటి అంశాలు.

Комментарии

Информация по комментариям в разработке