పెదపట్నం - Godavari Flood Present Situation// Andhra Pradesh

Описание к видео పెదపట్నం - Godavari Flood Present Situation// Andhra Pradesh

కోనసీమ జిల్లాలో వరదలకు చాలాప్రాంతాలు నీట మునిగి చాలా ఆస్తి నష్టం జరిగింది . మామిడికుదురు మండలం పెదపట్నం రత్నాపురం వరద లో ఉన్న పరిస్థితి ని మీకు చూపించే ప్రయత్నం చేశాను . (19.7. 2022 ) పెదపట్నం రత్నా పురం వద్ద వరద లో నడుచుకుంటూ వెళ్లి ఈ వీడియో తీయడం జరిగింది . భవనాల చుట్టూ నీళ్లు చేరి ఉన్నాయి . వరద తగ్గుముఖం పడటంతో చాలాచోట్ల ఇల్లు శుభ్రం చేసుకుంటున్నారు . కొంతమంది తడిచిన బట్టలు సామానులు ఆరబెడుట్టుకుంటున్నారు . కొన్ని ఇల్లు ఇంకా నీట మునిగి ఉన్నాయి .నీటి కుళాయి లో నీరు రంగు మారిపోయాయి . ఇక్కడ పడవ సదుపాయం లేక పోవడం తో ట్యూబ్ లు , నీళ్లట్యాంక్ డబ్బాలు తెప్పలు వలె ఉపయోగిస్తున్నారు . గ్రామస్తులకు మంచినీరు , ఇతర సామాగ్రిని యువకులు ట్యూబ్ ల సాయంతో అవతల ప్రక్క వారికీ అందిస్తున్నారు . వరద తగ్గుతున్నా గానీ ఇక్కడ నీటి ఉద్రితి చాల ఉక్కవగా ఉంది . రైతులు పశువులను డాబాల పై కి తీసుకు వెళ్లారు . పశుగ్రాసం కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు .కూరగాయలు , అరటి ,కొబ్బరి తోటలు నీట మునిగి ఉన్నాయి . వాలంటీర్ లు కూరగాయలు , పాలు వరద నీటిలో ఇంటింటికి తిరిగి అందిస్తున్నారు . చాల మంది రేషన్ కోసం నడుం లోతు వరద నీటిలో నడిచి వెళ్ళవలసి వస్తుంది . బంధువులు , స్నేహితులు వరద నీటిలో ఉన్నవారికి సహాయంగా ఆహారాన్ని అందిస్తున్నారు .
ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. బందు మిత్రులకు వీడియో ని షేర్ చేయండి .
"వరద బాధితులకు మంకు చేతనైన సహాయం చేద్దాం "

In Konaseema district many areas were submerged due to floods and a lot of property was damaged. I have tried to show you the flood situation in Pedapatnam , Mamidikuduru Mandal ,Konaseema District , Andhdra Pradesh. (19.7. 2022) This video was taken while walking in flood at Pedapatnam Ratnapuram. There is water around the buildings. As the flood recedes, the house is being cleaned in many places. Some people are drying wet clothes and luggage. Some houses are still under water.The water in the water tap has changed color. As there is no boat facility here, tubes and water tank cans are used as rafts. Young people are providing fresh water and other supplies to the villagers with the help of tubes. Although the flood is receding, the water stress here is very strong. The farmers took the cattle to the terraces. Farmers are suffering due to shortage of fodder. Vegetables, banana and coconut plantations are submerged in water. Volunteers are returning vegetables and milk to houses in flood waters. Many people have to walk in waist deep flood water for ration. Relatives and friends are providing food to help those in flood water.
Give your opinion on this video in the comment box. Share the video with your friends.
"Let's do our best to help the flood victims"

Комментарии

Информация по комментариям в разработке