మసాలా ఎగ్ బుర్జీ | Masala Egg Bhurji | Egg Bhurji | Tomato Egg Bhurji | Scrambled Egg Masala

Описание к видео మసాలా ఎగ్ బుర్జీ | Masala Egg Bhurji | Egg Bhurji | Tomato Egg Bhurji | Scrambled Egg Masala

మసాలా ఎగ్ బుర్జీ అనేది సాధారణంగా చేసే ఎగ్ బుర్జీకన్నా కొంచెం టొమాటోలు, మసాలాల ఫ్లేవర్తో ఎక్కువ రుచికరంగా ఉంటుంది. దీన్ని రసం, సాంబార్ అన్నంతోనే కాదు, రోటీ, ఫుల్కాల్లోకి సర్వ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది.

Link to ఎగ్ రెసిపీలు (Egg Recipes) in Telugu: https://cutt.ly/4nwnjoV

#masalaeggbhurji #homecookingtelugu #scrambledeggs #homecooking #hemasubramanian #indianscrambledeggs #tomatoeggbhurji

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...

Here's the link to this recipe in English: https://bit.ly/3hPOrLf

తయారుచేయడానికి: 5 నిమిషాలు
వండటానికి: 20 నిమిషాలు
సెర్వింగులు: 4

కావలసిన పదార్థాలు:

నూనె
దాల్చిన చెక్క - 1 ముక్క
యాలకులు - 2
లవంగాలు - 3
ఉల్లిపాయలు - 2 (చిన్నగా తరిగినవి)
పచ్చిమిరపకాయలు - 2 (చిన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీస్పూన్
టొమాటోలు - 3
ఉప్పు - 1 టీస్పూన్
పసుపు - 1 / 4 టీస్పూన్
కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - 1 టీస్పూన్
గరం మసాలా పొడి - 1 / 2 టీస్పూన్
గుడ్లు - 5
తరిగిన కొత్తిమీర

తయారుచేసే విధానం:

ముందుగా ఒక వెడల్పాటి బాండీలో నూనె వేసి, అందులో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకూ వేయించాలి

ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలపాలి

ఇప్పుడు టొమాటోలు వేసి, వేయించి, అవి కాస్త మగ్గిన తరువాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి అంతా బాగా కలిపి నూనె పైకి తేలేంత వరకూ వేయించాలి

ఇప్పుడు గరం మసాలా పొడి వేసి అంతా బాగా కలిపి, బాండీ మధ్యలో కొద్దిగా ఖాళీ చోటు తయారుచేసి, అందులో కొద్దిగా నూనె వేసి, గుడ్లను పగలకొట్టి వేయాలి

గుడ్లు కాస్త ఉడికేంత వరకూ ఎక్కువ కదిలించకుండా లైట్గా కలపాలి

ఆ తరువాత గుడ్లని మసాలాతో కలిపి మిక్స్ చేసి, పైన తరిగిన తాజా కొత్తిమీర వేసి, మసాలా ఎగ్ బుర్జీను వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK -   / homecookingtelugu  
YOUTUBE:    / homecookingtelugu  
INSTAGRAM -   / homecookingshow  

A Ventuno Production : http://www.ventunotech.com

Комментарии

Информация по комментариям в разработке