Kanchi Paramacharya Leelau - 6|| Travelling with Granite Stones || Mandara Mala ||

Описание к видео Kanchi Paramacharya Leelau - 6|| Travelling with Granite Stones || Mandara Mala ||

కంచి పరమాచార్య లీలలు ఎన్ని విన్నా తనివి తిరవు. ఇప్పుడు ఒక భక్తుడు పెరియవ అనుగ్రహంతో ప్రయాణంలో ప్రమాదం నుండి ఎలా తప్పించుకున్నదో చూడడం.

భగవంతుడి దృష్టిలో వున్న వారికి సర్వం శుభం అవుతుంది. వారిని ఎప్పుడు ఏ ఆపద రాకుండా ఆయన నిత్యం గమనిస్తూనే వుంటాడు. నడిచే దైవం, దయగల దేవుడు శ్రీ శ్రీ శ్రీ కంచి పరమాచార్య తన భక్తులను వెయ్యి కనులతో కాపడుతూ వుంటారు. ఆ పరమ గురువుపై పూర్తి విశ్వాసముంచి, ఆ పెరియవ పాదాలపై భారాన్ని మోపడమే భక్తుల పని. ఇక భక్తులను రక్షించడం ఆయన పని. ఆయన చేతలు, మాటలు మానవ మాత్రులకు అంతు పట్టవు. తన మనోనేత్రంతో క్షణకాలంలో భూత భవిష్యత్ కాలాలను ఏక కాలంలో చుడగలరు భగవాన్ పరమాచార్య. ఒక్కొక్క సారి ఆ పరమ గురువు తన భక్తులను కాపాడేతీరు అంతుపట్టకుండా వుంటుంది. ఆయన తన చమత్కారమైన లీలలతో భక్తులను కష్టాల బారిన పడకుండా చూడడం ఎవరికీ అవగతం కాదు. ఒక్కొక్కసారి ఆయన సలహాలు భక్తులను అయోమయమైన స్థితికి తెస్తాయి. అంతలోనే వారికి క్షేమం, ఆశీర్వాదం కలిగిస్తాయి. అలా అయోమయానికి గురై, పెద్ద ఆపద నుండి బయటపడ్డ మహాస్వామి భక్తుడు మన సబేసన్ అనుభవం గురించి తెలుసుకుందామా......

Комментарии

Информация по комментариям в разработке