Swati Maliwal Alleged That a Member of Delhi Chief Minister Arvind Kejriwal's Personal Staff

Описание к видео Swati Maliwal Alleged That a Member of Delhi Chief Minister Arvind Kejriwal's Personal Staff

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ MP, దిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ స్వాతి మాలీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు తనపై దాడి చేశారనీ..... సీఎం నివాసంలోనే ఈ ఘటన జరిగిందని పోలీసులకు ఫోన్ చేశారు. సమాచారం అందడంతో పోలీసులు సీఎం నివాసానికి వెళ్లగా స్వాతి మాలీవాల్ అప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి నివాసం నుంచి ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో మాలీవాల్ నుంచి రెండు సార్లు ఫోన్ వచ్చిందని పోలీసులు తెలిపారు. కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు తనపై దాడి చేశారని స్వాతి మాలీవాల్ పేర్కొన్నట్టు చెప్పారు. అయితే ఈ ఘటనపై అధికారిక ఫిర్యాదు మాత్రం అందలేదని స్పష్టం చేశారు. స్వాతీ మాలీవాల్ పై దాడి వార్తలపై భాజపా తీవ్ర విమర్శలు గుప్పించింది. దిల్లీ సీఎం సహాయకుడు తనపై దాడి చేశారని స్వాతీ మాలీవాల్ ఆరోపించారని భాజపా ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి ఇంటినుంచి పోలీసులకు కాల్ వెళ్లిందనీ... కేజ్రీవాల్ అరెస్టుపై స్వాతీ మాలీవాల్ ఎందుకు మౌనం వహించారో గుర్తుకువస్తుందా అని పేర్కొన్నారు. కేజ్రీవాల్ అరెస్టు సమయంలో ఆమె భారత్ లో లేరన్న అమిత్ మాలవీయ......చాలా రోజుల పాటు స్వదేశానికి తిరిగి రాలేదని గుర్తు చేశారు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке