ఆ మంత్రిత్వ శాఖలు నా మనసుకు దగ్గరగా ఉన్నాయి: పవన్ | Deputy CM Pawan Kalyan Thanks To CM Chandrababu

Описание к видео ఆ మంత్రిత్వ శాఖలు నా మనసుకు దగ్గరగా ఉన్నాయి: పవన్ | Deputy CM Pawan Kalyan Thanks To CM Chandrababu

డిప్యూటీ సీఎంగా నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నందుకు సంతోషంగా ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ విధంగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందని ఓ ప్రకటనలో తెలిపారు. ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకోవడం.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెడతానని జనసేనాని తెలిపారు. గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకుంటూ పరిశ్రమలను ప్రోత్సహిస్తామన్నారు. అటవీ సంపదను కాపాడి.. పచ్చదనాన్ని పెంచుతామన్నారు. జనసేన మంత్రులకు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు.... ప్రజాప్రయోజన శాఖలు అప్పగించడం హర్షణీయమన్నారు. పర్యాటక ప్రాజెక్టుల ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చేస్తామన్నారు. సినిమా రంగానికి రాష్ట్రంలో స్నేహపూరిత వాతావరణం తీసుకొస్తామని తెలిపారు. సినీ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ఈ రంగంలో యువతకు ఉపాధి దక్కేలా చేస్తామన్నారు. తనకు కీలక శాఖలు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు.. పవన్ కృతజ్ఞతలు తెలిపారు. తాను నిర్వర్తించబోయే శాఖలపై మరింత లోతైన అధ్యయనం జరిపి ప్రజలకు అత్యంత మేలైన ఫలాలను అందించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке