ఆదాని కోసం కేంద్ర ప్రభుత్వం పని చేస్తోంది.
సీఎం కేసీఆర్ గారి విజన్ తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి.
ఎల్బీనగర్ నియోజకవర్గం లో ఎగిరేది భారాస జెండా నే.
: ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు.
ఈరోజు ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని హయత్ నగర్ డివిజన్ నందు మాజీ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి మరియు డివిజన్ బారాస అధ్యక్షులు చెన్నగొని శ్రీధర్ గౌడ్ గార్ల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్సీ బుగ్గరపు దయనంద్ గుప్తా గార్లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ.కేసీఆర్ గారి విజన్ తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని తెలిపారు.రాష్ట్రంలో పటిష్టమైన శాంతిభద్రతలతో పాటు,సమర్ధవంతమైన పాలన సాగుతుండడంతో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోంది అని తెలిపారు.కేంద్రం తెలంగాణ ప్రభుత్వం మీద సవతి ప్రేమ చూపెడుతుంది అని తెలిపారు.తెలంగాణ కు కేటాయించల్సిన నిధులు మనకు కేటాయించడం లేదని తెలిపారు.కేవలం ఆదాని కోసం కేంద్ర ప్రభుత్వం పని చేస్తోంది అని విమర్శించారు.ఎల్.బి.నగర్ నియోజకవర్గం గతంలో ఎలా ఉండేది?ప్రస్తుత అభివృద్ధి ఎలా ఉందన్న విషయం ప్రతి ఒక్కరు గమనించాలని తెలిపారు.ఎల్.బి.నగర్
నియోజకవర్గ పరిధి ఉన్న పార్కులు దేశంలో ఎక్కడ లేవని తెలిపారు.ఎల్.బి.నగర్ నియోజకవర్గన్నీ 3,000 వేల కోట్ల రూపాయలతో అన్ని రంగాల్లో సమగ్రవంతంగా అభివృద్ధి చేపడుతున్నామని తెలిపారు.నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారితో పాటు సాగర్ హైవే,ఇన్నర్ రింగ్ రోడ్డులలో ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెడుతూ దాదాపు 658 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్లు,అండర్ పాస్ లు నిర్మించి ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తీర్చిదిద్దామని తెలిపారు.అలాగే రోడ్డు డివైడర్ల మధ్యలో ఉన్న చెట్లను అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం జరుగుతుందని అన్నారు.ఎల్.బి.నగర్ నియోజకవర్గన్నీ ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు.నియోజకవర్గ పరిధిలో ప్రధాన సమస్యలు పరిష్కరించడం జరిగింది అని తెలిపారు.కొన్ని సమస్యలు ఉన్నాయి.వాటిని కూడా ప్రణాళికబద్దంగా నేరవేస్తామని తెలిపారు.మీకు ఎల్లప్పుడూ ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటా.మేము చేసిన అబివృద్దే రాబోయే రోజుల్లో ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలో మళ్ళీ బారాస జెండా ఎగరడం ఖాయం అని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు గుడాల మల్లేష్,సీనియర్ నాయకులు బోడ భిక్షపతి,నక్క రవీందర్ గౌడ్,దర్శన్ గౌడ్,భాస్కర్ సాగర్,రాజశేఖర్,దీపావళి శ్రవణ్,రాకేశ్,లక్ష్మారెడ్డి,మధు,బాలు నాయక్,స్కైలాబ్,కృష్ణ రెడ్డి,కృష్ణ,దేవారం,రాఫిక్,బాలు,అంజమ్మ,సత్తిరెడ్డి,రవీందర్ రెడ్డి,వెంకటేష్,ఆయన్న,గోవర్ధన్ నాయక్,రాజు,ఉమ యాదవ్,అమరావతి,దీపావళి శ్రీకాంత్
మహిళా అధ్యక్షురాలు అంజలి గౌడ్ మరియు పలువురు నాయకులు,ఉద్యమకారులు,మహిళలు,పలు విభాగాల అనుబంధ కమిటీ సభ్యులు,కార్యకర్తలు,పార్టీ అభిమానులు,పలు కాలనీ అధ్యక్ష,కార్యవర్గ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Информация по комментариям в разработке