34.నాభ్యాలవాలరోమాళిలతాఫలకుచద్వయీ:లలితా సహస్రనామాలపై వ్యాఖ్యానం - దుర్భా.కృష్ణ కిషోర్. M.A., M.Phil.

Описание к видео 34.నాభ్యాలవాలరోమాళిలతాఫలకుచద్వయీ:లలితా సహస్రనామాలపై వ్యాఖ్యానం - దుర్భా.కృష్ణ కిషోర్. M.A., M.Phil.

34. నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయీ:- లలితా సహస్రనామాలపై వ్యాఖ్యానం - దుర్భా.కృష్ణ కిషోర్. M.A., M.Phil.,Sanskrit, M.A.,Telugu, M.A.,Astrology. శ్రీ హరిహరపుత్ర జ్యోతిషాలయం. 944 1371 802.

శ్రీ లలితా రహస్య సహస్రనామాలకి భౌతికపరమైన, ఆధ్యాత్మికపరమైన అర్థాన్ని తెలియజేసే కార్యానికి పూనుకుంటున్నాను. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఈ వీడియో లో తెలియజేసిన విషయాలన్నీ మహర్షులు, మహానుభావులు వ్రాసిన పుస్తకాలనుండి సేకరించబడినది. అమ్మవారి నామాలకి వ్యాఖ్యానాన్ని వీడియోల రూపంలో అందించాలని నా చిరకాల వాంఛ. అది ఇప్పుడు సాకారమైంది. దయచేసి వీడియోని పూర్తిగాచూసి CHANNEL SUBSCRIBE, LIKE, SHARE & COMMENT చేసి ప్రోత్సహించండి.

నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయీ : ఈ నామము కూడా 16అక్షరాలని కలిగినదే. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు " నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయ్యై నమః " అని పలకాలి.

ఈ నామంలో చరాచరసృష్టికి తల్లియైన ఆ లలితాపరమేశ్వరి వక్షస్థల వర్ణన చేస్తున్నారు వ్యాసులవారు.

సాధారణంగా లోకంలో ఏదైనా తీగను పెంచాలంటే భూమిని త్రవ్వి, గుంటచేసి, గుంటచుట్టూ మట్టిని ఎత్తుగావేసి పాదుని చేస్తాము. సరిగ్గా ఇలానే అమ్మవారి నాభి పాదులాగా వున్నదట. అయితే ఇక్కడ తీగ ఏమిటండీ అంటే......

Комментарии

Информация по комментариям в разработке