Nagali Kallalo Kanniruendhkoo || Mittapalli Surender || Raythu Pata,Song ||Mittapalli Songs

Описание к видео Nagali Kallalo Kanniruendhkoo || Mittapalli Surender || Raythu Pata,Song ||Mittapalli Songs

#Mittapalliraithupata
#Nagalikallalokanniruendhkoo
#Mittapallisongs

Producer : Kalavena Shankaranna
Pen&sung : Mittapalli Surender
Music : Madeen Sk
Violin 🎻 : Sandiliya
Dop&editing : Madhu Studio Hyd
Recording : Evarest Studio Hyd
Execution by : Leader Kalyan


పల్లవి: నాగలి కళ్ళలో
కన్నీరెందుకో
అందరి ఆకలి
తీర్చినందుకా
ఎద్దులా బండికి
ఎదురీతేందుకో
కొందరి స్వార్ధము
పండనందుకా
మట్టినుండి
పుట్టించుకున్న పంటనెందుకో
కక్షగట్టి తాకట్టు పెట్టె
ఈ రాజ్యమెందుకో
రాజధాని కళ్ళముందే
రైతులెందరో
రాలుతున్న రాజు ఒకడు
ఆపడేందుకో

పుస్తెలమ్మి తెచ్చుకున్న
విత్తనాల బస్తా నకిలీ
నెత్తురోసి పెంచుకున్న
చేనులోన కాపు నకిలీ
ఎదుగుతున్న పొలముకేసే
ఎరువులు నకిలి
పంట సేలా ఒంటిమీద చల్లే
మందులు నకిలి
ఇన్ని మోసాలు తట్టుకుంటూ
ఎగుసం జేసి
కంచమందు ప్రపంచానికి
అన్నమయ్యింఅందుకా

గిట్టుబాటు ధరల కోసం
తిరుగుబాటైన చెయ్యనోడు
అధికధరకై ఆశపడుతు
అడ్డదారిలో పంట అమ్మనోడు
రైతుకన్నా నిజాయితున్న
మనిషి ఎవ్వడు
లోకమంతా వెతికి చూడు
ఉండడోక్కడు
సాటి మనిషి మేలుకోరే
భూమి పుత్రులా
సావుకోరి సాగుతున్న
ప్రభుత్వమెందుకు

మట్టితల్లి మనసు తప్ప
మనిషి మర్మం ఎరుగనోడు
పొద్దుపొడుపు ద్యాసతప్ప
వెన్నుపోటంటే తెలియనోడు
కలుపు దీసె గుణము తప్ప
కల్ల ఎరుగని
రైతుకంట రాలుతున్న
రక్తధారని
ఆపలేని ఆదుకోని
దేశప్రజలని
అడుగుతున్నాది
హలము నేను అనాధనా అని
The end

Комментарии

Информация по комментариям в разработке