East Gangavaram Famous Jilani Chicken Pakodi | 15 Years Famous Chicken Pakora | Ongole | Food Book

Описание к видео East Gangavaram Famous Jilani Chicken Pakodi | 15 Years Famous Chicken Pakora | Ongole | Food Book

స్వాగతం.. నమస్కారం.. నా పేరు లోక్ నాధ్.

నేను ఈ వేళ మీకు పరిచయం చేయబోతున్నాను. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ పరిధిలోని తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామంలో ప్రసిద్ధి చెందిన జిలానీ గారి చికెన్ పకోడీని.


ఆహారాన్ని నాణ్యతతో,రుచికరంగా, ఆమోదయోగ్యమైన ధరలో ఆత్మీయుతతో అందిస్తూ తింటే జిలానీ గారి చికెన్ పకోడీనే తినాలి అనేంతలా విశేష జనాదరణ పొందారు వారు.

జిలాని చికెన్ పకోడీ,తూర్పు గంగవరం, తాళ్లూరు మండలం,ప్రకాశం జిల్లా.

గూగుల్ లొకేషన్:- https://maps.app.goo.gl/Lr6Q3UrV2WRiy...


సూక్ష్మ పరిశీలనతో ఈ ఉపాహారాన్ని తయారు చేస్తారు జిలాని గారు.మేలిమి గల ముడి పదార్థాలనే వినియోగిస్తారు.వేయించడానికి నాణ్యమైన నూనె ఉపయోగిస్తారు. వాడిన నూనెను మరోమారు వాడరు.మసాలాలను సొంతంగా తయారు చేసుకుని,ముక్కలు పెద్దివిగా ఉండువిధంగా చూసుకుని తమకే సొంతమైన సూత్రీకరణలో సిద్ధం చేసుకున్న మసాలా మిశ్రమానికి ముక్కలు
కలుపుకుని పకోడీలను తయారు చేస్తారు.
ఆకర్షణీయం కోసం ఏ మాత్రం వర్ణం వినియోగించరు. మసాలా,కారం రీత్యా వచ్చే సహజ వర్ణమే ఎంతో ఇంపుగా ఉండి తినాలని ప్రేరేపిస్తుంది.

అంతిమంగా చికెన్ పకోడీ పై ప్రత్యేకమైన పొడిన విరజల్లి నిమ్మకాయ, ఉల్లిపాయలతో అందిస్తారు.

కమ్మటి సువాసన వెదజల్లే ఈ అల్పాహారం పై నిమ్మకాయని పిండి,ఉల్లిపాయ ముక్కలతో జోడించి అలా నోటికి అందించగానే అమోఘమైన రుచి లభిస్తుంది.అత్యంత నాణ్యతతో కూడిన ఆహారం తిన్నామన్న భావన దరిమిలా తృప్తికర ఆస్వాధన మనకు కలుగుతుంది.తినే కొద్దీ తినాలనిపిస్తుంది.అంత బావుంటుంది.
కనుకనే జిలానీ గారి పకోడీ కోసమై సుదూర ప్రాంతాల నుంచి సైతం వస్తారు.

జిలానీ గారి శాలను నాకు పరిచయం చేసిన సోదరుడు చరణ్ రెడ్డి కీ ధన్యవాదాలు.

Комментарии

Информация по комментариям в разработке