నీపై వెలుగు విరజిల్లే సంవత్సరం.. (2021)నూతన సంవత్సర పాట|4K| Sis.Sharon|Latest Telugu Christian song

Описание к видео నీపై వెలుగు విరజిల్లే సంవత్సరం.. (2021)నూతన సంవత్సర పాట|4K| Sis.Sharon|Latest Telugu Christian song

నీపై వెలుగు విరజిల్లే సంవత్సరం.. (2021)నూతన సంవత్సర పాట ! 4K || Latest Telugu Christian Song || Lyrics and Tune: Sis.Sharon||
@Pastorpraveen


నీపై వెలుగు విరజిల్లే సంవత్సరం, నీతి సూర్యుడుదయించె హితవత్సరం, (2)
నీ దుఃఖ దినములు సమాప్తమాయెను, నీ నిందకు రెట్టింపు ఘనత వచ్చును. (2)
“ నీపై వెలుగు”

నీ సరిహద్దులలో సమాధానము, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచును.
నీ చేతి పనులను దీవించును, రెండింతల మేలు నికనుగ్రహించును.
నిత్యమైన కృపను నీకు చూపును, ఏ కీడు రాకుండ కాపాడును. (2)
నీ దుఃఖ దినములు సమాప్తమాయెను, నీ నిందకు రెట్టింపు ఘనత వచ్చును. (2)
“నీపై వెలుగు”

శాశ్వత ప్రేమతో ప్రేమించును, నీరు కట్టిన తోట వలె చిగురించుదువు.
నీ గాయములను మాన్పివేయును, ఆరోగ్యము నీకు కలుగజేయును.
అభివృద్ధి పరచి ఫలింపజేయును, మంచి పేరు ఖ్యాతిని దయచేయును.(2)
నీ దుఃఖ దినములు సమాప్తమాయెను, నీ నిందకు రెట్టింపు ఘనత వచ్చును (2)
“నీపై వెలుగు”

తొలకరి వర్షమును కురిపించును, కడవరి ఉజ్జీవము ప్రవహింపజేయును.
ఉత్సాహ సంతోషం కలుగజేయును, కృపయు క్షేమములు నీ వెంట వచ్చును.
నీ గిన్నె నిండి పొర్లి పారును. దయకిరీటమును ధరింపజేయును. (2)
నీ దుఃఖ దినములు సమాప్తమాయెను, నీ నిందకు రెట్టింపు ఘనత వచ్చును (2)
“నీపై వెలుగు”

Комментарии

Информация по комментариям в разработке