Exclusive interview with Radio Drama artist Sarada Srinivasan

Описание к видео Exclusive interview with Radio Drama artist Sarada Srinivasan

రేడియో అన‌గానే కొంద‌రి పేర్లు చ‌టుక్కున గుర్తుకువ‌స్తాయి. ఒక్కో కార్య‌క్ర‌మానికి ఒక్కో ఆర్టిస్ట్ ప్ర‌త్యేకంగా నిలుస్తారు. నాట‌కాలు అన‌గానే మ‌దిలో మెదిలే మొద‌టి పేరు శార‌దా శ్రీ‌నివాస‌న్‌. తేనెలు కురిపించే మాట‌ల‌ను వ‌ర్షించ‌డం ఆమె ప్ర‌త్యేక‌త‌. పాత్ర‌లో ఒదిగిపోవ‌డం స‌హ‌జ సిద్దంగా జరిగిపోతుంది. పాత్ర పేరు త‌లుచుకుంటాము త‌ప్ప అక్క‌డ న‌టిస్తున్న వారిని కాదు. అలా చేస్తేనే ఆ పాత్ర‌కు న్యాయం చేసిన‌ట్లు. ఒక నండూరి విఠ‌ల్‌, కూచిమంచి కుటుంబ‌రావు, కందుకూరి చిరంజీవి రావు, నార్ల చిరంజీవి, నండూరి సుబ్బారావు, సి. రామ్మోహ‌న్ రావు... మ‌హిళ‌లో అయితే విబి క‌న‌క‌దుర్గ‌, నాగ‌ర‌త్న‌మ్మ‌, ఇలా చెప్పుకుంటూ వెళ్ళ‌వ‌చ్చు. ఆ వ‌రుస‌లో మొద‌ట నిలిచేది శార‌దా శ్రీ‌నివాస‌న్ పేరు. ఏనాడు తాను గొప్ప అని అనుకోలేదు. ఎలాంటి పాత్ర ఇచ్చినా దానికి న్యాయం చేసేవారు. పాటైనా...నాట‌క‌మైనా...రూప‌క‌మైనా...నాటిక అయినా... ఏదైనా స‌రే... చ‌క్క‌గా విధి నిర్వ‌హించేవారు. రేడియో ఉద్యోగంలో చేరిన ద‌గ్గ‌ర‌నుంచి విధి నిర్వ‌హ‌ణ‌లో ఎదుర్కొన్న ఆటుపోట్లు...జ‌రిగిన మంచి చెడులు అన్నింటినీ వైజ‌యంతి మాటామంతిలో చ‌క్క‌గా వివరించారు. 87ఏళ్ళ వ‌య‌సులో కూడా ఆమె స్వ‌రంలో ప‌దును త‌గ్గ‌లేదు. మాధుర్యమూ త‌గ్గ‌లేదు. లాడ్లీస్ మీడియా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ఇచ్చిన సంద‌ర్భంగా వ్యూస్ ఆమెను ప‌లుక‌రించింది. ఈ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూను ఆస్వాదించండి. న‌లుగురికీ పంచండి.

Visit us : https://vyus.in/

Follow Us @
Facebook:   / vyustheunbiased  
Twitter :   / vyusopinion  

Join Us @
Telegram : https://t.me/vyus_The_Unbiassed

Комментарии

Информация по комментариям в разработке