శ్రీశైలానికి ఉత్తరద్వారరహస్యగుడి. chenchu jatara Nallamala. secret of bramaramba cheruvu.

Описание к видео శ్రీశైలానికి ఉత్తరద్వారరహస్యగుడి. chenchu jatara Nallamala. secret of bramaramba cheruvu.

శ్రీశైలానికి పూర్వం నాలుగు పురాతన నడక మార్గాలు ఉన్నాయి. శ్రీశైలానికి ఉత్తర ద్వార మార్గం ఉమామహేశ్వరం తో ప్రారంభమవుతుంది. తెలంగాణ ప్రాంత భక్తులు ఎక్కువగా ఈ మార్గాన్ని ఉపయోగించుకునేవారు. ఉత్తర ప్రాంతం నుంచి వచ్చే భక్తులకు రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి అవి నీలిగంగా మార్గం, జాతరరేవు మార్గం.

నీలి గంగా మార్గం నాగర్ కర్నూల్ వద్ద ప్రారంభమై ఆమ్రాబాద్ మీదగా ఉమామహేశ్వరం చేరుకొని అక్కడ నుండి అప్పాపురం, భౌరాపూరం ,మేడిమల్కల , సంగడిగుండాల నుండి నీలి గంగా రేవును చేరి నదిని దాటి చుక్కలపర్వతం ఎక్కి శ్రీశైలం చేరుతారు.
ఈ మార్గంలో 14వ శతాబ్దంలో వెలమరాజు అయిన మాదానాయకుడు మెట్లను సత్రాలను నిర్మించారని శాసనాదారం.
పూర్వం కాలినడకన వెళ్లే భక్తులు ఈ భౌరాపూర్ వద్ద బస చేసి ఇక్కడ సేదతీరేవారు. కారణం ఈ ప్రాంతం పల్లపు ప్రాంతం కాబట్టి నీటి వనరులు ఉండేవి.
మలిచాళుక్యుల కాలం మొదలుకొని రేచర్లపద్మనాయకుల కాలం వరకు ఇక్కడ భ్రమరాంబ దేవాలయం నిర్మాణం జరిగింది .
శ్రీశైలం డ్యాం నిర్మాణం జరగడంతో ఘాట్ రోడ్డు భౌరాపూరం నుండి కాక వటవర్లపల్లి నుండి నిర్మాణం జరిగింది. దీనితో బౌరవపురం జాతర మరుగున పడింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 నుండి అధికారికంగా చెంచులపండుగ పేరుతో ఈ జాతర మళ్ళీ నిర్వహిస్తున్నారు.
ప్రతి శివరాత్రి రోజున మాత్రమే చెంచుల తో పాటు సాధారణ భక్తులు కూడా ఈ జాతరకు హాజరవుతారు.

https://www.youtube.com/results?searc...
https://www.facebook.com/profile.php?...
  / srinivas_ontariyatrikudu  

mysterious temple in nallamala, secret of #bramaramba cheruvu,hidden temples in srisailam,nallamala forest temple,ontari yatrikudu,Nallamala chenchu jatara,nallamala chenchulu, #chenchu jatara, #bourapurchenchujatara ,nallamala forest,temples in nallamala forest,nallamala forest temples,hidden temple in nallamala forest,temples in nallamala forests,srisailam temple,nallamala temples,mysterious temple in srisailam,shiva temples in nallamala forests,srisailam video

Комментарии

Информация по комментариям в разработке