Sraavyasadhanamu ॥ శ్రావ్యసదనము ॥ Hosanna Ministries 2024 New Album Song-5

Описание к видео Sraavyasadhanamu ॥ శ్రావ్యసదనము ॥ Hosanna Ministries 2024 New Album Song-5

   • Hosanna Ministries International Inau...  
#Hosannaministries #Hosannaministriesgorantla
#HosannaMinistriesOfficial #live

నీవే శ్రావ్య సదనము - నీదే శాంతి వదనము
నీవే శాంతిసదనము - నీ దివిసంపద సన్నే చేరగా
నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా
నా ప్రతి స్పందనే ఈ ఆరాధన
నా హృదయార్పణ నీకే యేసయ్య

విరజిమ్మే నాపై కృపకిరణం
విరబూసి పరిమళమై కృపకమలం
విశ్వాసయాత్రలో ఒంటరినై విజయశిఖరము చేరుటకు
నీదక్షిణ హస్తం చాపితివి - నన్నాదుకొనుటకు వచ్చితివి
నను బలపరచి - నడిపించే - నా యేసయ్యా

నీనీతి నీరాజ్యం వెదకితిని
నిండైన సౌభాగ్యం పొందుటకు
నలిగివిరిగిన హృదయముతో
నీ వాక్యమును సన్మానించితిని
శ్రేయస్కరమైన దీవెనతో
శ్రేష్ఠఫలములను ఇచ్చుటకు
నను ప్రేమించి- పిలచితివి - నా యేసయ్యా

పరిశుద్ధాత్మకు నిలయముగా
ఉపదేశమునకు వినయముగా
మహిమ సింహాసనము చేరుటకు
వధువు సంఘముగా మార్చుమయ్య
నా పితరులకు ఆశ్రయమై
కోరివరేవుకు చేర్పించి
నీ వాగ్దానం నెరవేర్చితివి - నా యేసయ్యా

Комментарии

Информация по комментариям в разработке