boncheruvu palle ramakrishnamma padina siddaiah patalu padave podam manasdahamsa rave podam
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ( 1608-1693). స్వస్తీశ్రీ చాంద్రమానేన కీలక నామ సంవత్సర కార్తీక మాస శుద్ధ ద్వాదశినాడు జన్మించారు. 17వ శతాబ్దానికి చెందిన పరమ పుురషులు. కాలజ్ఞానాన్ని బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త. సాక్షాత్ దైవ స్వరూపుడు. బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. తీర్థ యాత్రలు చేస్తున్నటువంటి విశ్వబ్రాహ్మణ పుణ్యదంపతులు పరిపూర్ణయాచార్యులు, ప్రకృతాంబలకు కాశీ పట్టణంలో జన్మించి, కర్ణాటక రాష్ట్రం, స్కందగిరి పర్వతసానువులో స్థితమైన పాపాగ్ని మఠ (ప్రస్తుతం ఇది చిక్‌బళ్లాపూర్ జిల్లా లోని కళవారహళ్లిలో ఉన్నది) అధిపతులు వీరభోజయాచార్య, వీరపాపమాంబలవద్ద పెరిగిన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి, వైఎస్ఆర్ కడప జిల్లా లోని కందిమల్లాయపల్లిలో చాలాకాలం నివసించి సజీవ సమాధి నిష్ఠనొందాడు. వీరబ్రహ్మము వలన ప్రసిధ్ది పొందుట చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలములో బ్రహ్మంగారిమఠంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఏ వింత జరిగిన ఇది బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లు పోకుండా ఇప్పటివరకు జరిగాయి. జరుగుతున్నాయి.బ్రహ్మం గారు సాక్షాత్ దైవ స్వరూపుడు. రాబోయే కాలంలో జరగబోయే విపత్తుల గురించి తన కాలజ్ఞానంలో సుస్పష్టంగా వివరించి, జనులందరిని సన్మార్గంలో నడువమని బోధించిన మహిమాన్వితుడు. చరిత్రకారుల కాలజ్ఞాన పరిశోధన ఫలితంగా, బ్రహ్మం గారు చిన్నతనములోనే తల్లిదండ్రులను కోల్పోయి అత్రి మహాముని ఆశ్రమంలో చేరుకున్నారు. కర్ణాటక లోని పాపాఘ్ని మఠాధిపతి యనమదల వీరభోజయచార్యులు, సతీ సమేతంగా సంతాన భాగ్యం కోసం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ అత్రి మహాముని ఆశ్రమం చేరుకుంటాడు. సంతాన ప్రా్తి కై పరితపిస్తున్న ఆ పుణ్య దంపతుల చెంతకు, దైవ స్వరూపులు అయిన బ్రహ్మం గారిని అత్రి మహాముని అందజేస్తాడు. వీరభోజయాచార్య, ఈ బాలుడు, మహిమాన్వితుడు, మునుముందు, ఈ బాలుడు ఎన్నో వింతలు చూపించబోతున్నాడు అంటూ ఆ బాలుని వీరభోజయాచార్య దంపతులకు అందజేస్తాడు.ఆ విధంగా బ్రహ్మం గారు పాపాఘ్ని మఠాధిపతి గారింట సనాతన సంప్రదాయాల నడుమ పెరుగుతూ వస్తాడు. (ఈనాడు కర్ణాటక లోని పాపాఘ్ని మఠం బ్రహ్మం గారి ప్రథమ మఠంగా పేరు గాంచి దివ్య క్షేత్రంగా వెలుగొందుతున్నది). అతి చిన్న వయసులోనే, బ్రహ్మం గారు కాళికాంబ పై సప్తశతి రచించి అందరిని అబ్బురపరుస్తాడు. బ్రహ్మం గారి పదవ ఏట వీరభోజయచార్యులు స్వర్గాస్తులవుతారు. అటు పిమ్మట దేశాటన నిమిత్తమై బయలుదేరబోతు తన తల్లి ఆశీర్వాదాలు కోరతాడు. అందుకు, వారి తల్లి, నాయన, వీరంభోట్లయ్య (బ్రహ్మం గారు చిన్న నాడు వీరంభోట్లయ్యగా పిలువబడ్డారు, పాపాఘ్ని ప్రస్తుత మఠాధిపతుల వద్ద దీనికి సంబంధించి శాసనాలు ఉన్నాయి), మఠాధిపత్యం స్వీకరించవలసిన నీవు ఇలా తల్లిని వదిలి పెట్టి దేశాటనకు బయల్దేరితే ఎలాగంటూ శోక సంద్రంలో మునిగి పోతుంది. అప్పుడు బ్రహ్మం గారు, తన తల్లి గారికి సృష్టి క్రమాన్ని వివరించాడు. స్త్రీ పురుషుల సంభోగం పవిత్ర కార్యమని, శుక్రశోణితంతో స్త్రీ గర్భ ధారణ గావించాక, గర్భం ధరించిన ప్రతి నెలలో, కడుపులో శిశువు ప్రాణం పోసే విధానాన్ని కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తారు బ్రహ్మం గారు. ఆగామి, ప్రారబ్ధ, సంచిత కర్మ సిద్ధాంతము గురించి వివరించి ఆమెకు మాయ తెరను తొలగించి, లోక కళ్యాణ నిమిత్తమై దేశాటనకు బయల్దేరతారు బ్రహ్మం గారు.కర్నూలు జిల్లాలొని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో గోపాలకుడిగా ఉంటు, రవ్వలకొండలో కాలజ్ఞానం వ్రాశారు. ఆవుల చుట్టూ గిరి గీసి రవ్వల కొండలో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మం గారు. ఒకరోజు మిగతా గోపాలకులు ఈ విషయాలన్నీ చూచి భయపడి పరుగు పరుగున, అచ్చమ్మ గారికి ఈ విషయాన్ని చేరవేస్తారు. మరుసటి రోజున యథావిధిగా ఆవులను తీసుకుని వెళ్లి చుట్టూ గిరి గీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావిస్తూ ఉన్న బ్రహ్మం గారిని చూసి ఆశ్చర్య పోతుంది అచ్చమ్మ. (అచ్చమ్మ బ్రహ్మం గారిని దర్శించుకున్న రవ్వలకొండలో ఈనాడు సుందరమైన బ్రహ్మం గారి దేవాలయం ఉన్నది). బ్రహ్మం గారి మహిమ తెలుసుకున్న అచ్చమ్మ, ప్రుట్టు గుడ్డి వాడైన తన కొడుకు బ్రహ్మానంద రెడ్డికి చూపు ప్రసాదించమని ప్రార్థిస్తుంది. బ్రహ్మం గారు తన దివ్య దృష్టితో, బ్రహ్మానంద రెడ్డి గత జన్మ పాపాలను దర్శించి, అతనికి చూపు ప్రసాదించి, పాప నివృత్తి గావించారు. గుహలో కూర్చుని వ్రాసిన తాళపత్ర గ్రంథాలు మఠంలో నేటికీ భద్రంగా ఉన్నాయి. కాలజ్ఞానం వ్రాసిన తర్వాత బ్రహ్మంగారు కందిమల్లాయపల్లె చేరి వడ్రంగి వృత్తిచేస్తూ గడిపాడు. తనవద్దకు వచ్చినవారికి వేదాంతం వినిపిస్తూ కులమతాలకు అతీతంగా అంతా సమసమాజం బాటన నడవాలని బోధించాడు.బ్రహ్మంగారి పూర్తి పేరు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. అతను తండ్రి పోతులూరి పరిపూర్ణయాచార్యులు, తల్లి పోతులూరి ప్రకృతాంబలకు, క్రీస్తు శకం 1608 లో జన్మించాడు . అతనును పెంచిన తండ్రి పేరు వీర భోజయాచార్యులు, పెంచిన తల్లి పేరు వీరపాపమాంబ. అతనుకు చిన్న వయస్సులోనే విశేష జ్ఞానం లభించింది. ఎక్కువ ఆత్మచింతన మితభాషణం అలవడింది. అతను వీర భోజయాచార్యులు మరణానంతరం స్వయంగా జ్ఞాన సముపార్జన చేయాలని నిశ్చయించి తన ఎనిమిదవ ఏట దేశాటన కొరకు తల్లి అనుమతి కోరాడు.
సిద్దయ్య
బ్రహ్మంగారు వైదిక మతావలంబీకులైనా కులమతాలకు అతీతంగా వ్యవహరించాడు.స్త్రీల పట్ల ఆదరణను ప్రదర్శిస్తూ తన భావాలను వెలిబుచ్చాడు.అలాగే దూదేకుల కులానికి చెందిన సైదులను తనశిష్యునిగా చేసుకున్నాడు.అతను ఉన్నత భావాలను భక్తి శ్రద్ధలను మెచ్చుకుని తన ప్రీయశిష్యుని చేసుకుని అతనుకు అనేక ఉన్నత భోదలు చేసాడు.అతను జ్ఞానంలభించినవాడని ప్రశంశించి జ్ఞానంసిద్దించింది కనుక సిద్దయ్యగా నామకరణం చేసాడు."సిద్ధా" అనే మకుటంతో కొన్ని పద్యాలను అసువుగా చెప్పాడు.
Информация по комментариям в разработке