రూ.3500తోనే బైక్ వీడర్.. మెట్ట సాగుకు సూపర్ | Bike Weeder | Telugu Rythubadi | రైతు బడి

Описание к видео రూ.3500తోనే బైక్ వీడర్.. మెట్ట సాగుకు సూపర్ | Bike Weeder | Telugu Rythubadi | రైతు బడి

చాలా ఏండ్లుగా పశువులతో వ్యవసాయం చేస్తున్న రైతు వీరబోయిన సాలయ్య గారు.. తన పాత బైక్ కు వీడర్ సెట్ చేసుకున్నారు. కేవలం 3500 రూపాయల ఖర్చుతో మోటార్ సైకిల్ కు గుంటుక, దంతె ఏర్పాటు చేసుకొని.. రెండు పశువులతో ఒక్క రోజులో చేసుకునే పనిని అతి తక్కువ ఖర్చుతో సులభంగా చేస్తున్నారు. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం దేవుని గోపాలపురం గ్రామానికి చెందిన సాలయ్య గారి సోదరుడు వీరబోయిన పెద్దులు గారు ఈ వీడియోలో.. ఆ బైక్ వీడర్ ఉపయోగాన్ని వివరించారు. ఎవరైనా ఈ విధంగా తయారు చేయించుకోవాలి అనుకుంటే ఈ వీడియోను మీ సమీపంలోని వెల్డింగ్ షాపులో చూపిస్తే చేసి ఇస్తారు. లేదంటే త్వరలోనే ఈ వీడర్ తయారు చేసిన వెల్డర్ తో ఏ విధంగా తయారు చేసుకోవాలనే వీడియో కూడా చేసి మన చానెల్లో పబ్లిష్ చేస్తాము.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : రూ.3500తోనే బైక్ వీడర్.. మెట్ట సాగుకు సూపర్ | Bike Weeder | Telugu Rythubadi | రైతు బడి

#RythuBadi ‪@RythuBadi‬ #BikeWeeder

Комментарии

Информация по комментариям в разработке