పురాణాల ప్రకారం,వాస్తు పురుషుని జన్మరహస్యం?

Описание к видео పురాణాల ప్రకారం,వాస్తు పురుషుని జన్మరహస్యం?

పురాణాల ప్రకారం,వాస్తు పురుషుని జన్మరహస్యం|According to Puranas,the secret of Vastu Purusha's birth?
#vastu #vastupurusha #telugu #vastushastra #puranalu #sirivastuchannel #telugu #viralvideo #house #vastuforhome #vastutips #vastuforfactory #vastuforwealth

ప్రతి మనిషికి సుఖసంతోషాలతో పాటు, పిల్లాపాపలతో
ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలంటే నివాసయోగ్యమైన ఒక ఇల్లు కావాలి.
భౌగోళికంగా, ఆరోగ్యపరంగా,గాలి,నీరు, వెలుతురు, ఉత్తమమైన భూమిపై
అన్ని వసతులతో నిర్మించుకునేదే ఇల్లు.ఇటువంటి ఇల్లు నిర్మించుకోవడానికి ఉపయోగ పడేదే వాస్తు శాస్త్రం.
వాస్తు అంటే నివాసగృహం లేదా నివాస ప్రదేశం అని అర్థం. శాస్త్రం అంటే శాసించేది లేదా రక్షించేది అని అర్ధం.వెరసి వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం. ఇది నిర్మాణంలో ప్రతికూల మరియు అనుకూల శక్తుల మధ్య సమతుల్యతను కొనసాగించే ఒక కళ. అంటే వాస్తు రీత్యా నిర్మించబడిన ఇంటిలో నివసించే వారికి ఆరోగ్యం, ఆనందం,సంపద మరియు శ్రేయస్సును ఇస్తుందని ఒక నమ్మకం.హిందూ పురాణాల ప్రకారం, పూర్వ కాలంలో అంధకాసురడనే రాక్షసుడు ముల్లోకాల వాసులను ముప్పతిప్పలు పెట్టుచుండేవాడు.అప్పుడు లోక సంరక్షణార్థం పరమేశ్వరుడు ఆ రాక్షసునితో యుద్ధం చేశాడు. ఆ సమయంలో శివుని లలాటం నుండి రాలిన ఒక చమట బిందువు భూమిపై పడి దాని నుండి భయంకరమైన కరాళవదనంతో ఒక గొప్ప భూతంగా ఉద్భవించి క్రమ క్రమంగా భూమి, ఆకాశాలను ఆవరించసాగింది. ఆ మహాభూతాన్ని చూసిన ఇంద్రాది దేవతలు భయభ్రాంతులై బ్రహ్మదేవుని శరణువేడారు. అష్ఠ దిక్పాలకుల సహాయంతో, సర్వలోక పితామహుడు అయిన బ్రహ్మ, దేవతలను ఊరడించి, ఆ భూతమును అధోముఖంగా భూమి యందు పడవేసే విధానం చెప్పాడు. బ్రహ్మ దేవుని ఆనతి ప్రకారం దేవతలందరూ ఏకమై ఆ భూతమును పట్టి అధోముఖంగా క్రిందకు పడవేశారు. ఆ భూతం భూమిపై ఈశాన్య కోణమున శిరస్సు, నైరుతి కోణమున పాదములు, వాయువ్య ఆగ్నేయకోనాలందు బాహువులు వుండునట్లు అధోముకంగా భూమిపై పడింది.
ఇంతమంది దేవతల తేజస్సముదాయంతో దేదీప్య మానంగా వెలుగొందుతున్న, ఆ భూతకార అద్భుతాన్ని తిలకించిన బ్రహ్మదేవుడు, దాన్ని 'వాస్తు పురుషుని'గా సృష్టి గావించాడు.భాద్ర పద బహుళ తదియ, మంగళవారం, కృత్తికా నక్షత్రం, వ్యతీపాత యోగము,భద్రనా కరణం గుళికతో కూడిన కాలంలో ఆ వాస్తు పురుషుడు జన్మించాడు.ఏ అపకారం చేయని నాపై, ఇంతమంది దేవతలు అధిష్టించి, పీడించుచున్నారు. వీరినుండి కాపాడమని వాస్తు పురుషుడు, బ్రహ్మ దేవుణ్ణి వేడుకున్నాడు.అప్పుడు బ్రహ్మ సంతోషించి,ఓ వాస్తు పురుషా! గృహములు నిర్మించునపుడు, గృహప్రవేశ సమయములందు, గ్రామ, పట్టణ, కోట, దేవాలయ,జలాశయ, ఉద్యాన వన నిర్మాణ సమయములందు ముందుగా నిన్నే పూజిస్తారు. ఆలా పూజించని వారికి దరిద్రముతో పాటు, అడుగడుగునా విఘ్నములు, చివరకు మృత్యువు కూడా సంభవించునని వాస్తు పురుషునికి వరమిచ్చాడు.అంతేగాక వాస్తు పురుషుని పై అష్ట దిక్కులలో వున్న దేవతలను తృప్తి పొందు విధంగా ఆయా స్థలాలలో నివసించే దేవతలు వారి వారి విధులు నిర్వహించుట వలన గృహస్తులకు సర్వ సుఖములు, సత్ఫలితాలు కలుగునట్లు ఆశీర్వదించాడు.

గృహారంభ సమయంలో అంటే శంకుస్థాపన సమయంలోను, గృహ ప్రవేశ సమయములలోనే కాకుండా కొన్ని ప్రత్యేక సందర్భాలలో కూడా వాస్తు పురుషున్ని పూజించడం మంచిదని పురాణాలు చెబుతున్నాయి.ప్రతీ సంవత్సర ఆరంభమునను,యజ్ఞయాగాదులయందును, ఉపనయన కాలమందును,వివాహ సమయమునను,మహోత్సవాలయందును,
పిడుగు పడినప్పుడును,అగ్నికి దగ్దమైనను,గుడ్ల గూబ ప్రవేశించిన యెడల,తేనె పట్టు పట్టిన గృహమునను వాస్తు పురుషుని పూజింపవలెను.

Vastu Shastra is an ancient science from the Vedas that tells us about home building and architecture in sync with nature and its elements. According to Vastu Shastra, those who build houses and live in them will get good yoga.

Through this Siri Vastu Channel, we are informing about some important facts, things and secrets of Vastu Sastra understood in many ancient Vastu Shastra texts and on the internet.
We wish everyone to be happy and prosperous by following Vastu.

Please contact for more details:
Raamachaaryulu Daita,
Siri Vastu Consultancy,
Hyderabad-37
Whatsup : 9347354678
e-mail : [email protected]

Follow us

Facebook :   / sirivastu123  
Instagram :   / sirivastu123  

Disclaimer :
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. The administrators don’t warrant that any information obtained from this channel will be error free.

Комментарии

Информация по комментариям в разработке