కృష్ణకు గోదావరి సాయం సురుచి ఫుడ్స్ ఒకరోజు అమ్మకాలు విరాళం??#

Описание к видео కృష్ణకు గోదావరి సాయం సురుచి ఫుడ్స్ ఒకరోజు అమ్మకాలు విరాళం??#

కృష్ణకు గోదావరి సాయం
సురుచి ఫుడ్స్ ఒకరోజు అమ్మకాలు విరాళం 
----------------------------------------
వరద బాధితుల సహాయం కోసం తమ 7 బ్రాంచీలలో సెప్టెంబర్ 8 వతేదీ ఆదివారం రోజు జరిగే అమ్మకాల మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని సురుచి ఫుడ్స్ నిర్ణయించింది.

ఈమేరకు సురుచి ఫుడ్స్ అధినేత శ్రీ పోలిశెట్టి మల్లిబాబు మీడియాకు తెలియజేసారు. ఇప్పటికే తాము తక్షణమే స్పందించి , ''కృష్ణకు గోదావరి సాయం'' పేరిట వరదబాధితులకు 2వేల బ్రెడ్స్ , 1150 క్రీమ్ బన్స్ జామ్ , పికిల్స్ తో అందించామని ,  కానీ అది ఏ మూలకూ సరిపోదని భావించి , ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు . 

గతంలో 2018 లో కూడా కేరళ వరద బాధితులకు సహాయం అందించడం కోసం తాము ఇలాంటి నిర్ణయాన్ని తీసుకొని, 6 లక్షల రూపాయలను కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చామని ఆయన చెప్పారు.
అప్పట్లో సురుచికి 3 శాఖలే  ఉండేవని,  ఇప్పుడు తాపేశ్వరం ,  కాకినాడ ,  రాజమహేంద్రవరం , మండపేటలలో మొత్తం 7 బ్రాంచీలు ఉన్నాయని ఆయన తెలిపారు. అందుచేత ఇప్పుడు ఈ 7 బ్రాంచీలలో ఆదివారం నాటి  మొత్తం అమ్మకాలతో ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మొత్తంలో సహాయాన్ని అందించగలుగుతామని మల్లిబాబు అన్నారు.

వరద బాధితులకోసం తామూ ఏదో సహాయం చేయాలని మానవత్వం వున్న ప్రతీవారూ భావిస్తారని, ఆ సహాయాన్ని అందించే విషయంలో వివరాలు తెలియక , ఎక్కువ మొత్తం అందించలేక స్తబ్దంగా మిగిలిపోయిన వారందరినీ వరద బాధితుల సహాయనిధిలో  భాగస్వాములను చేసేందుకే ''కృష్ణకు గోదావరి సాయం'' అనే ఈ ఆలోచన చేశామని ఆయన వివరించారు . 

''ఆదివారం రోజు సురుచి అన్ని బ్రాంచీలలో స్వీట్లు, హాట్లు,  బ్రెడ్స్, బిస్కెట్స్ ఏమైనా కొనండి....మీ స్నేహితులకు, బందువులకు బహుమతిగా ఇవ్వండి. తద్వారా బాధిత కుటుంబాలకు చేయూతనివ్వండి!
మీరు ఆరోజు ఇక్కడ చెల్లించిన ప్రతి రూపాయి సీఎం సహాయనిధికి చేరుతుంది '' అంటూ శ్రీ మల్లిబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.

Комментарии

Информация по комментариям в разработке