వొల్లరా జన్మ మొల్లరా ఓ రామ రామ. ఈ పాట మనసారా వింటే జీవితంలో ఏ తప్పు చేయరు. vollara janma mollara.

Описание к видео వొల్లరా జన్మ మొల్లరా ఓ రామ రామ. ఈ పాట మనసారా వింటే జీవితంలో ఏ తప్పు చేయరు. vollara janma mollara.

వొల్లరా జన్మ మొల్లరా ఓ రామ రామ వొల్లరా జన్మ మొల్లరా

భీంప్లాస్ రాగం. ఆది తాళం
గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా

'పల్లవి

వొల్లరా జన్మ మొల్లరా ఓ రామ రామ"2"
వొల్ల వొల్లను పాడుజన్మా ఎల్లలోకులు నవ్వుచుందురు"2"
చిల్లరభాధలకు ఓర్వని"2" సిగ్గుమాలిన పాడు జన్మా"2"
"వొల్లరా జన్మా మొల్లరా ఓ రామ రామ "

చరణం 1

ఇల్లు వాకిలి నాదియనచు ఇల్లాలు పిల్లలు సంతసించుచు 2"
వెల్లిపోయేడు నాడు వెంబడి"2" చిల్లిగవ్వ రానిజన్మా"2"
"వొల్లరా జన్మమొల్లారా ఓ రామ రామ"

చరణం 2

నేనే భలవంతుడ నాని నాకు ఏమియు కొదవలేదని"2"
తాను తినక దాన మివ్యక "2"తరలిపోయే పాడు జన్మా"2"
"వొల్లరా జన్మ మొల్లరా ఓ రామ రామ "

చరణం3

ధార సుతులను గూడుకుని- దారిగానక సారేసారెకు"2"
పూర్వ ఖర్మాలాచరించి"2" గారెడై తిరిగేటి జన్మా "2"
"వొల్లరా జన్మ మొల్లరా ఓ రామ రామ "

చరణం 4

జిట్టెడంతా పొట్టకొరకు దుష్ఠ మానవులంత చేరి"2"
పట్టడంతా అన్నమునకు"2"పాలు మాలిన పాడు జన్మా"2"
"వొల్లరా జన్మ మొల్లరా ఓ రామ రామ"

చరణం 5

ఎక్కువగా, ధనము కలదని పెక్కుగా తన మదముచేత"2"
పక్కున పర స్త్రీల వెంబడి"2" కుక్కవలె తిరిగేటి జన్మా"2"
"వొల్లరా జన్మ మొల్లరా ఓ రామ రామ"

చరణం 6

మేడ మీద కట్టి మేలుగా కాలంబు గడిపీ"2"
కాలుని బారికి చిక్కి"2"కదలి పోయెడి పాడు జన్మా."2"
" వొల్లరా జన్మ మొల్లరా ఓ రామ రామ "

Комментарии

Информация по комментариям в разработке