పొదలకూరు నిమ్మకాయలు నేపాల్ కు , ప్లాస్టిక్ ట్రేలలో జాగ్రత్తగా ప్యాకింగ్...

Описание к видео పొదలకూరు నిమ్మకాయలు నేపాల్ కు , ప్లాస్టిక్ ట్రేలలో జాగ్రత్తగా ప్యాకింగ్...

పొదలకూరు నిమ్మకాయలు నేపాల్ కు...
ప్లాస్టిక్ ట్రేలలో జాగ్రత్తగా ప్యాకింగ్...
========================///
నెల్లూరు జిల్లా పొదలకూరు నిమ్మ మార్కెట్ యార్డ్ నుంచి నేపాల్ కు నిమ్మకాయలు ఎగుమతి అవుతున్నాయి. దూర ప్రయాణంలో కాయలు దెబ్బ తినకుండా ఉండేందుకు ప్లాస్టిక్ ట్రేలలో జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపుతున్నారు. గత రెండు నెలలుగా నేపాల్ కు పంపుతున్నట్లు పొదలకూరు నిమ్మ మార్కెట్ లోని నిమ్మ వ్యాపారి అక్కెం చిరంజీవి రెడ్డి పేర్కొన్నారు. లారీల ద్వారా ఈ నిమ్మకాయలు పాట్నాకు చేరుకుంటాయని, అక్కడ నుంచి నేపాల్ దేశస్తులు వివిధ వాహనాల్లో తమ ప్రాంతాలకు తరలించుకుంటారని తెలిపారు. నేపాల్ చేరుకోవడానికి అయిదు రోజులు సమయం పడుతుందని చెప్పారు. పొదలకూరు లెమన్ మర్చంట్ అసోసియేషన్ కార్యదర్శి అట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గోతాల్లో ప్యాక్ చేసి లారీల్లో పంపే సమయంలో బస్తాల ఒత్తిడికి కింద భాగం లోని బస్తాల కాయలు దెబ్బ దెబ్బతింటాయని, అందువల్ల ట్రేలల్లో ప్యాకింగ్ చేసి దూర ప్రాంతాలకు పంపుతున్నట్లు తెలిపారు. ట్రేల ద్వారా పంపిస్తే కాయలు దెబ్బ తినకుండా తాజాగా ఉంటాయని వివరించారు.► Download NDN Android App: http://goo.gl/Uvt9YB
► Like us on Facebook: https://goo.gl/va71DQ
► Subscribe to NDN HD Live: https://goo.gl/k6zj74
► Circle us on G+: https://goo.gl/OsCQgw
► Tweet NDN at : https://goo.gl/Xw1TQA

Комментарии

Информация по комментариям в разработке