ఆదివనవలమ్మ అమ్మవారి ఉయ్యాల సేవ

Описание к видео ఆదివనవలమ్మ అమ్మవారి ఉయ్యాల సేవ

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో కొలువై ఉన్న శ్రీ ఆది వనవలమ్మ అమ్మవారి ఆలయంలో పవిత్ర శ్రావణ మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రావణ శుక్రవారం నేపత్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేసి దూప దీప నైవేద్యాలను సమర్పించి మహా మంగళ హారతులు అందజేశారు. అనంతరం అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. ఆపైన అమ్మవారి ఉయ్యాల సేవను నేత్రపర్వంగా చేశారు. గర్భాలయంలోని అమ్మవారి ఉత్సవమూర్తిని వేడుకగా ఉయ్యాల వద్దకు తీసుకుని వచ్చి ఉయ్యాలలో వేంచేపచేసి సేవా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారి ఉయ్యాల సేవలో పాల్గొని తరించారు.

Комментарии

Информация по комментариям в разработке