SEXUAL REPRODCUTION IN PLANTS IN TELUGU, మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి

Описание к видео SEXUAL REPRODCUTION IN PLANTS IN TELUGU, మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి

మొక్కలలో ప్రత్యుత్పత్తి

→ పుష్పం అనేది మొక్క యొక్క లైంగిక భాగం.

పుష్పభాగములు పుష్పములో నాలుగు వలయాలుగా అమర్చబడి ఉంటాయి. అవి రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, కేసరావళి, అండకోశం.
→ కేసరావళి పుష్పంలోని పురుష ప్రత్యుత్పత్తి భాగం. అండకోశం పుష్పంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం.
→ నాలుగు వలయాలూ ఉన్న పుష్పాలను సంపూర్ణ పుష్పాలు అంటారు.

→ నాలుగు వలయాలలో ఏదైనా వలయం లేని పుష్పాలను అసంపూర్ణ పుష్పాలు అంటారు.
→ సాధారణంగా కేసరావళి, అండకోశం చాలా మొక్కల్లో ఒకే పుష్పంలో ఉంటాయి. ఈ రకమైన పుష్పాలను ద్విలింగ పుష్పాలు అంటారు.
→ కానీ కొన్ని పుష్పాలలో కేసరావళి కాని లేదా అండకోశం కాని ఉంటాయి. ఈ రకమైన పుష్పాలను ఏకలింగ పుష్పాలు అని అంటారు.
→ కేసరావళి మాత్రమే ఉండే ఏకలింగ పుష్పాలను మగ పుష్పాలు అంటారు.

→ అండకోశం మాత్రమే ఉండే ఏకలింగ పుష్పాలను స్త్రీ పుష్పాలు అంటారు.

→ పరాగరేణువులను పరాగకోశాల నుండి కీలాగ్రానికి బదిలీ చేసే ప్రక్రియను పరాగ సంపర్కం అంటారు.
→ ప్రత్యుత్పత్తి : తమలాంటి కొత్త జీవుల్ని ఉత్పత్తి చేయడాన్ని ప్రత్యుత్పత్తి అంటారు.
→ ఏకలింగ పుష్పాలు , : కొన్ని పూలలో కేసరావళి గాని లేదా అండకోశం కాని ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. ఇటువంటి పుష్పాలను ఏకలింగ పుష్పాలు అంటారు.
ఉదా : బొప్పాయి.
→ ద్విలింగ పుష్పాలు : సాధారణంగా కేసరావళి మరియు అండకోశం చాలా మొక్కలలో ఒకే పుష్పంలో ఉంటాయి. ఈ రకమైన పుష్పాలను ద్విలింగ పుష్పాలు అంటారు.
ఉదా : మందార.
→ కేసరాలు : మొక్కలలోని పురుష ప్రత్యుత్పత్తి అవయవాలను కేసరాలు అంటారు. ఇవి పుష్పంలోని మూడవ వలయం. సాధారణంగా పొడవుగా, మృదువుగా ఉండే నిర్మాణాలు.

→ అండకోశం : పుష్పంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాన్ని అండకోశం అంటారు. ఇది సన్నని నాళం వంటి నిర్మాణము. దీనిలో అండాశయం, కీలం మరియు కీలాగ్రం అనే భాగాలు ఉంటాయి.
→ పరాగ కోశాలు : ప్రతి కేసరం పైన ఉబ్బిన పెట్టె వంటి నిర్మాణం ఉంటుంది. దీనినే పరాగకోశం అంటారు. దీనిలో పరాగ రేణువులు ఉత్పత్తి అవుతాయి.
→ పరాగ రేణువులు : మొక్కలలోని పురుష సంయోగ బీజాన్ని పరాగ రేణువులు అంటారు. ఇవి పరాగ కోశంలో ఉత్పత్తి అవుతాయి.
→ అండాశయం : పుష్పాసనం (పైన ఉబ్బిన నిర్మాణాన్ని అండాశయం అంటారు. దీనిలో అండాలు ఉంటాయి.

→ ఫలదీకరణం : స్త్రీ, పురుష సంయోగ బీజాల కలయికను ఫలదీకరణ అంటారు.

→ సంయుక్తబీజం ఫలదీకరణ ఫలితంగా ఏర్పడే ద్వయస్థితిక కణాన్ని సంయుక్త బీజం అంటారు. ఇది మొక్కగా అభివృద్ధి చెందును.

.

Комментарии

Информация по комментариям в разработке