శ్రీవారి ఆస్తుల పరిరక్షణ కూటమి ప్రభుత్వ బాధ్యత | పవన్‌ కల్యాణ్‌ | Pawan Kalyan Visit Tirumala

Описание к видео శ్రీవారి ఆస్తుల పరిరక్షణ కూటమి ప్రభుత్వ బాధ్యత | పవన్‌ కల్యాణ్‌ | Pawan Kalyan Visit Tirumala

తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందని.... ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. టీటీడీ ఆస్తులను గత పాలకమండలి అమ్మే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. దేవుడి ఆభరణాలకు వైసీపీ హయాంలోని టీటీడీ బోర్డు రక్షణ కల్పించిందా లేదా అనే కోణంలో విచారణ అవసరమన్నారు. తిరుమలలో గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు, అక్రమాలపై పవన్ ప్రకటన విడుదల చేశారు. వేంకటేశ్వర స్వామిపై భక్తితో ఆస్తుల దస్తావేజులను కొందరు భక్తులు హుండీలో వేస్తారని... నిరర్థకం అంటూ వైసీపీ హయాంలోని టీటీడీ పాలక మండలి వాటిని అమ్మకానికి పెట్టిందన్నారు. తద్వారా 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని యత్నించారని.... ప్రతిపక్షాలు, హిందూ ధార్మిక సంస్థల పోరాటంతో ఆ ప్రక్రియ ఆగిందన్నారు. దీని వెనుక ఎవరున్నరనేది బయటికి తీస్తామన్నారు. పాలక మండళ్లకు నేతృత్వం వహించినవారు స్వామివారి ఆస్తులను అమ్మేశారని సందేహం వ్యక్తంచేశారు. అందుకే టీటీడీ ఆస్తులు విషయంలో గత పాలకమండళ్ల నిర్ణయాలపై సమగ్ర విచారణ చేయించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. శ్రీవాణి ట్రస్ట్ ఆదాయాన్ని ఎటు మళ్లించారో విచారణ చేయాలన్నారు. దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని ఆలయాలు, సత్రాల ఆస్తుల విషయంలోనూ సమగ్ర సమీక్ష అవసరమన్నారు. అప్పుడే దేవుడి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఉంటాయని, పాలక మండళ్లు జవాబుదారీతనంతో పని చేస్తాయని అన్నారు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке