RJ NEWS//SRD//ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో చలితో వణుకుతున్న అనాధలకు చేయూతనిచ్చిన జంగన్న గౌడ్

Описание к видео RJ NEWS//SRD//ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో చలితో వణుకుతున్న అనాధలకు చేయూతనిచ్చిన జంగన్న గౌడ్

చలితో వణుకుతున్న అనాధలకు చేయూతనిచ్చిన జంగన్న గౌడ్.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో ఏలాంటి దిక్కు లేకుండా అనారోగ్యంతో చలికి వణుకుతున్న అక్కడే పండుకుంటున్న పేదలను చూసి చలించిన ఎద్దు మైలారం గ్రామానికి చెందిన సామాజిక సంఘ సేవకులు, కొన్ని సంవత్సరాలుగా సమాజ సేవ చేస్తూ కరోనా టైంలో కూడా కరోనా మహమ్మారికి భయపడకుండా ఎంతోమందికి సహాయ సహకారాలు అందించారు, వలస కార్మికులకు తన వంతుగా తన తోసిన సహాయాలు అందించి సహాయం చేశారు, అదే సేవలు ఆపకుండా యధావిధిగా సంఘ సేవ చేస్తున్న కల్లుగీత కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డమీది జంగన్న గౌడ్ .
రగ్గులు పంపిణీ చేసి ఆకలితో అలమటిస్తున్న వారికి అన్నదానం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో
జంగన్న గౌడ్ మాట్లాడుతూ నేను ఎన్నోసార్లు హాస్పిటల్ ముందు ఉన్న అనాధ రోగులని చూసి బాధనిపించేది మనము ఇంట్లో ఉండే వాళ్లకే చాలా చలిగా ఉంటుంది, అక్కడ ఉండే వాళ్ళు ఎలా ఉన్నారు, అని చూడాలని హాస్పిటల్ ముందుకు వచ్చాను ఎలా ఉన్నారు అమ్మ అని అడిగితే సార్ చలిగా ఉంది ఆకలేస్తుంది అన్నారు, ఆ మాటకు బాధేసిన నేను నాకు తోచిన సహకారంతో భోజనము మరియు రగ్గులు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది, పేదలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ఇలా వారికి భోజనం మరియు రగ్గులు ఇస్తుంటే వారి కళ్ళల్లో సంతోషం మాటల్లో ప్రేమానురాగాలు విని నాకు వాళ్ల మాటలే భగవంతుని ఆశీర్వాదం అని చాలా సంతోషం అనిపించింది. భవిష్యత్తులో కూడా మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని ఆయన ఈ సందర్భంగా అన్నారు,
కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ మాట్లాడుతూ జంగన్న గౌడ్ గారు ఇప్పటికే అనేకమంది పేదవారికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ పేదవారికి చేతుగా నిలుస్తున్నవారికి కళ్ళు గీత కార్మిక సంఘం తరఫున అభినందనలు తెలుపుతున్నామని అన్నారు
వారు ఆయురారోగ్యాలతోటి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం సంగారెడ్డి మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్,ఉపాధ్యక్షులు కృష్ణ గౌడ్, అనిల్ గౌడ్, వెంకట్ , మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Комментарии

Информация по комментариям в разработке