Siima Awards 2024 Dubai Exclusive Red Carpet | TV5 GULF Team (Srikanth Chittarvu, Sowmya,Lalitha)

Описание к видео Siima Awards 2024 Dubai Exclusive Red Carpet | TV5 GULF Team (Srikanth Chittarvu, Sowmya,Lalitha)

Siima Awards 2024 Dubai Exclusive Red Carpet | TV5 GULF Team (Srikanth Chittarvu, Sowmya,Lalitha) | TV5 Entertainment

#siimaawards2024 #SIIMAinDubai

దుబాయ్: సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) - 2024 వేడుక దుబాయి వేదికగా అట్టహాసంగా జరిగింది. సెప్టెంబరు 14, 15 తేదీల్లో నిర్వహించిన ఈ వేడుకలో దక్షిణాది భాషల సంబంధించిన నటీనటులు హాజరై సందడి చేశారు.


తొలిరోజు తెలుగు, కన్నడ భాషల తారలు సందడి చేయగా, రెండో రోజైన సెప్టెంబరు 15న తమిళ, మలయాళ సినీ నటులు ఈ వేడుకకు హాజరై అవార్డులు అందుకున్నారు. అందాల భామలు ట్రెండీ దుస్తుల్లో దర్శనమిచ్చారు. ఫరియా అబ్దుల్లా, శ్రేయ, నేహాశెట్టి, శాన్వీ తదితరులు తమ ప్రదర్శనతో ఆహూతులను అలరించారు. 2023 సంవత్సరంలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన చిత్రాలకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు 'సైమా అవార్డులు' దక్కాయి.

2024 సంవత్సరానికి గానూ 'దసరా' మూవీలో నటనకు ఉత్తమ నటుడిగా నాని, ఉత్తమ నటిగా కీర్తి సురేశ్‌ అవార్డును అందుకున్నారు. ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ-అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'భగవంత్‌ కేసరి' నిలిచింది. ఇక కన్నడ చిత్రాలకు కూడా ఈ సందర్భంగా అవార్డులు అందించారు. 'సప్తసాగరదాచె ఎల్లో-ఎ'లో నటనకు గానూ ఉత్తమ నటుడిగా రక్షిత్‌శెట్టి, నటిగా రుక్మిణీ వసంత్‌ అవార్డులు అందుకున్నారు.


మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన 'పొన్నియిన్‌ సెల్వన్‌-2'లో నటనకు గానూ విక్రమ్‌ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. తమిళంతో పాటు, తెలుగు ప్రేక్షకులను అలరించిన రజనీకాంత్‌ 'జైలర్‌' ఉత్తమ చిత్రంగా నిలిచింది. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇక '2018'లో చిత్రంలో నటనకుగానూ టొవినో థామస్‌ ఉత్తమ నటుడి (మలయాళం) అవార్డును అందుకున్నారు. ఇక మమ్ముట్టి నటించిన 'నన్పకల్‌ నేరతు మయక్కం' ఉత్తమ చిత్రంగా నిలిచింది.

టీవీ5 గల్ఫ్ టీం శ్రీకాంత్ చిత్తర్వు, స్పెషల్ కరెస్పాండంట్ లు సౌమ్య, లలిత.. దుబాయ్ నుండి ఎక్సక్లూసివ్ కవరేజ్ ఇవ్వటం జరిగింది.

#tv5entertainment #tv5tollywood


TV5 Entertainment - Subscribe Our Channel For Latest Tollywood Gossips and Exclusive Interviews with Tollywood Stars and Much More.

Subscribe to TV5 Entertainment : http://bit.ly/2KRNtxb
Like Us on Facebook : www.facebook.com/tv5tollywood

Комментарии

Информация по комментариям в разработке