Godadevi Padamalika || Goddess Godadevi Devotionals || My Bhakthi Tv

Описание к видео Godadevi Padamalika || Goddess Godadevi Devotionals || My Bhakthi Tv

Title: Godadevi Padamalika
Lyrics: Jarajapu Trinadha Murthy
Composed by: Baggam Dhananjaya
Singer: Tandugu Krishna Rao
Godadevi Chalisa
Produced by: B.N Murthy & Palli Nagabhushana Rao
Published By : Musichouse
Recorded at Sri Matha Digital Recording Studio, Visakhapatnam. (8106766133)
గోదాదేవి శుభచరితం మహిమాన్విత సుధాభరితం అతులితపావన సంకలితం శ్రవణజీవనం ముక్తిప్రదం
గోదాదేవి వందనము ధరణీ పుత్రిక వందనము
శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము

మానవకన్యగ జనియించి విగ్రహరూపుని వరియించె
శ్రీరంగనాధుని పతిగానెంచి అపూర్వ చరితను సృష్టించె
పవిత్రవ్రతమును ఒనరించి యెల్లజనులకు హితమును పంచె
భావితరాలకు యుక్తముగ గ్రంధరూపమున అందించె

యెదురుగ ఉన్న విగ్రహమూర్తిని నిజమూర్తిగా తను భావించి
అనుపమానము అసమానమునగు దైవ ప్రభావము దర్శించె
విగ్రహమూర్తిని కదిలించి పరిణయమాడిన ప్రామాణ్యం
గోదాకళ్యాణ వైభవము అమ్మవారికి ప్రాముఖ్యం

ఉలకని పలకని దేవదేవుని తనచేతనతో మేల్కొలిపినది
పిల్లవానిగా మనసునతలచి స్వామికి బోధన చేసినది
మనుజుల మేలును మదిలోనెంచి స్వామికి నడవడినేర్పినది
స్పందించిన శ్రీరంగనాయకులు ఆండాళమ్మను వరించెను

శ్రీవిల్లిపుత్తూరు నందు అవతారమూర్తి శ్రీకృష్ణుండు వటపత్రముపై శయనించి లోకరక్షణము గావించే
ఆ శ్రీవిల్లిపుత్తూరు నందు భట్టనాధుడను విప్రుండు వసించె నిరతము విష్ణు చింతనతొ ప్రసిద్ధి చెందెను విష్ణుచిత్తునిగ

విష్ణుచిత్తుడు ప్రతినిత్యం పూలమాలలను స్వయముగ కూర్చి శ్రీకృష్ణునికి అర్పించి భక్తిగపూజలు చేయుచుండెను
విష్ణుచిత్తుని భక్తిని చూసి విష్ణుభక్తులలొ ప్రసిద్ధిపొందిన ఆల్వారులుగా కీర్తించి పెరిఆల్వారుగ బిరుదము నొసగిరి

పెరిఆల్వారులు ఒకనాడు తులసిమొక్కలకు పాదులు తీయుచు
అశ్చర్యముగ అచటగాంచెను పాలుగారు చిన్నారిపాపను
అచటదొరికిన చిన్నారిపాపను దైవప్రసాదముగా భావించి కోదై అను నామముతో గారాభముగా పెంచసాగెను

కోదై అనగా పూలమాల కోదైనామమే కాలక్రమముగ గోదాదేవిగ రూపాంతరమై విధంబుగా ప్రసిద్ధి చెందెను
చిరుప్రాయమునే గోదాదేవికి భక్తిభావనలు అంకురించెను కృష్ణలీలలను యెల్లపుడు ఆడుతుపాడుతు గడుపుచుండెను

యుక్తవయసులో గోదాదేవికి భక్తిభావనలు ప్రేమగమారి కళ్ళుమూసినా కళ్ళుతెరిచినా
నల్లనివానినే కాంచసాగెను
విల్లిపుత్తూరు గోకులమ్ముగ తన స్నేహితులను గోపికలుగ అన్నివేళలా భావనచేసి ఆవిదంబుగా చరించసాగెను.

విష్ణుచిత్తుడు భగవంతునికై రూపొందించిన పూలమాలలను గోదాదేవి ముందుగ ధరించి తనలో కృష్ణుని గాంచి మురిసెను
ఈదృశ్యమును విష్ణుచిత్తుడు ఒకదినమునందు కన్నుల కాంచి జరిగినది అపచారమని తలచి ఎంతయొ చింతించె

కలలో కాంచిన విష్ణుచిత్తునకు శ్రీకృష్ణుడు తన మోదము తెలిపె గోదా ధరించు పూలమాలలు ప్రీతిపాత్రమని వివరించే
వివరమునెరిగిన గోదాదేవి శ్రీకృష్ణుని తన పతిగాకోరి చెలికత్తెలను కలుపుకొని కాత్యాయని వ్రతమాచరించెను

ఆహారానికి అలంకరణకు సంబందించిన కఠిననియమములు గోదాదేవి పాటించి పాశురములుగా వివరించె వైష్ణవభక్తుల గ్రుహములలో తిరుప్పావైగ వినిపించే గీతములే ఈపాశురమ్ములు ఉపనిషత్తుల సారములు

అమిత ప్రేమకు లొంగిన కృష్ణుడు విష్ణుచిత్తునకు కనిపించి గోదాదేవికి శ్రీరంగమునకు తోడ్కొనిరమ్మని వివరించే శ్రీరంగములో అర్చకులకును గోదాదేవితొ తన పరిణయము నిర్ణయమ్మును యెరిగించ అందరు నందము పొందిరట

సకలపురజనులు వెంటనురాగ అర్చకులందరు తోడుగరాగా గోదాదేవిని తోడ్కొని వెళ్ళి ఆలయమందున ప్రవేశమందే
పెళ్ళికూతురుగ గర్భగుడినందు ప్రవేశించిన గోదాదేవి ఎల్లజనులును చూచుచుండగ రంగనాధునిలొ ఐక్యమయ్యెను.

శ్రీవిల్లిపుత్తూరునందు అమ్మవారిని ఉత్సవమూర్తిగ రంగనాధుడు మలిచిన పిదప తాను కలిసెను ఉత్సవమూర్తిగ
అవతారమూర్తి శ్రీరామచంద్రుని ఇలవేల్పు శ్రీరంగనాధుడు
శ్రీరంగనాధుని పరిణయమాడి గొదాదేవియు ఇలవేల్పయ్యెను

నాటినుండి ప్రతి వైష్ణాలయమున భోగీనాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణోత్సవము జరిపించుట ఒక సాంప్రదాయము
ధనుర్మాసమున తొలిమలి సంధ్యలొ దీపారాధన చేయుట వలన లక్ష్మీకటాక్ష సిద్ధి ప్రాప్తము సకల సంపదల సిద్ధి తద్యము

తిరుప్పావైని సుప్రభాతముగ ధనుర్మాసమున గానము చేయుట విష్ణాలయమున నివేదనలను బాలలకిచ్చుట సాంప్రదాయము
దేవతలకు ఇది బ్రహ్మి మూహూర్తము మకర కర్కాటక సంక్రాంతులలో పుజలు చేయుట శుభకరము భక్తజనులకు ఒక వరము

ధనుర్మాసమున ఆలయాలలో పండగ సందడి నెలకొని వుండగ ధనుర్మాస వ్రతమాచరించడం వైష్ణవ భక్తుల మోదనము
మొదటి పక్షమున చెక్కెరపొంగలి రెండవపక్షము దద్రోజనము నైవేద్యముగ మధుసూధనునికి సమర్పించడం దివ్యభోగము

భూదేవి అవతారమైన ఆండళమ్మ విరచితమైన దివ్య ప్రభంధము గానము చేయుట సర్వజనులకు ముక్తిప్రదం
అనునిత్యమును బ్రహ్మముహూర్తం సుభగడియలలో తిరుప్పవై పారాయణము దివ్యవరం దైవానుగ్రహసంగతము

ఇంటిముంగిట ముగ్గులువేసి గొబ్బెమ్మలను అందున నిలిపి పసుపుకుంకుమతొ అలంకరించి పూజించు కన్యకు కల్యాణయోగం ధనుర్మాసమున ఆండాలు పూజ తిరుప్పావై పఠనముతో గోదాకళ్యాణ వేడుక చూసిన జన్మధన్యము శుభయోగం



NO COPYRIGHT INFRINGEMENT INTENDED.

COPYRIGHT NOTICE:
Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting YouTube about a Copyright Infringement. Thank You, sir...
******************************************************************************************************************
My Bhakti Tv channel does not support any illegal activities these videos are only for video log and Entertainment and giving Updates purposes please share this to your family and friends also like and comment.


Enjoy and stay connected with us!!

Subcribe For More Devotional Songs

►My Bhakti Tv Telugu Devotional Songs : https://goo.gl/48o9zN

►My Bhakti Tv Tamil Devotional Songs : https://goo.gl/Ct1CcI

►My Bhakti Tv Oriya Devotional Songs : https://goo.gl/jUC98l

Комментарии

Информация по комментариям в разработке