బైపాస్ వల్ల లాభాలు | Medicover Hospitals

Описание к видео బైపాస్ వల్ల లాభాలు | Medicover Hospitals

బైపాస్ వల్ల లాభాలు | Medicover Hospitals

డా. ఏ. ఆర్. కృష్ణ ప్రసాద్, చీఫ్ కార్డియోథొరాసిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్, ఈ వీడియో లో బైపాస్ సర్జరీ వల్ల కలిగే లాభాల గురించి వివరించారు.

గుండెకి రక్తం తీసుకెళ్లే రక్తనాళ్ళల్లో బ్లాక్స్ రావడం వల్ల స్టెంటింగ్ లేదా బైపాస్ చేస్తారు. ఒక పదిహేను సంవత్సరాల క్రితం వరకు, ఒకటి లేదా రెండు రక్తనాళ్ళల్లో బ్లాక్స్ ఉండి, రక్తనాళ్ళల్లో సరళ మార్గం ఉండి, బ్లాక్స్ చిన్నగా ఉన్నప్పుడు, వైద్యులు స్టెంటింగ్ చేసేవారు. అంతకంటే ఎక్కువ బ్లాక్స్ ఉన్నప్పుడు బైపాస్ సర్జరీ ని సూచించేవారు. ఇప్పుడు టెక్నాలజీ లో మార్పు రావడం వల్ల, కొన్ని సంక్లిష్ట పరిస్థితులలో కూడా స్టెంటింగ్ అనేది చేస్తున్నారు. దీని వల్ల ప్రపంచం అంతటా కూడా ఎవరికి స్టెంటింగ్ చేయాలి, ఎవరికి బైపాస్ చేయాలి అని గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సింటాక్స్ అని ఒక పరిశోధన చేసారు, ఈ పరిశోధన ప్రకారం సింటాక్స్ స్కోర్ అనేది 22 కంటే ఎక్కువ ఉంటె బైపాస్ వల్ల ఎక్కువ లాభాలు కలుగుతాయి అని, 22 కంటే తక్కువగా ఉంటె స్టెంటింగ్ వల్ల ఎక్కువ లాభాలు కలుగుతాయి అని తెలిపారు. మనుషుల శరీర నిర్మాణాలు అనేవి ఒకేలా ఉండవు, సింటాక్స్ స్కోర్ ఉన్నా కూడా కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో, వైద్యులు సలహా ఇచ్చిన దాని బట్టి, ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి స్టెంటింగ్ చేస్తున్నారు, ఈ స్టెంటింగ్ చేయడం వల్ల లాభాలని మరియు ప్రమాదాలను తెలుసుకోవాలి. బైపాస్ సర్జరీ వల్ల అన్ని బ్లాక్స్ కి ఒకేసారి చికిత్స చేయవచ్చు, దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఏ పద్దతి ధ్వారా అయితే మనం మొత్తం రక్త ప్రసరణ ని మళ్ళీ తీసుకొని రాగలమో, దాని పూర్తి రివాస్కులరైజేషన్ అని అంటాము. ఇది బైపాస్ ధ్వారా ఎప్పుడు చేసిన కానీ సాధ్యం అవుతుంది, స్టెంటింగ్ విషయంలో కొన్ని సార్లు సాధ్యం కాదు. ఎవరైనా బైపాసా సర్జరీ గురించి నెగటివ్ గా చెప్తే నమ్మకుండా, అది మీకు సరైన ప్రక్రియ అవునా కాదా అని తెలుసుకోవాలి.

మరిన్ని వివరాల కోసం వీడియోని పూర్తిగా వీక్షించండి!

#BenefitsOfBypassSurgery #BypassSurgery #MedicoverHospitals #BypassSurgeryTreatment

For Appointments, Call 040 6833 4455
or
Visit: https://www.medicoverhospitals.in/
https://www.medicoverhospitals.in/doc...

►Subscribe https://bit.ly/MedicoverHospitalsYouTube for Health Tips, News & more.

Follow us on Other Platforms:
Facebook:   / medicoverhospitals  
Instagram:   / medicoverhospitals  
Twitter:   / medicoverin  
Linkedin:   / medicoverhospitals  

Комментарии

Информация по комментариям в разработке