పిన్నెల్లి సోదరుల నుంచి నాకు ప్రాణహాని ఉంది | మాణిక్యరావు | Life Threat From Pinnelli Brothers

Описание к видео పిన్నెల్లి సోదరుల నుంచి నాకు ప్రాణహాని ఉంది | మాణిక్యరావు | Life Threat From Pinnelli Brothers

ఎన్నో నాటకీయ పరిణామాల తరువాత పిన్నెల్లి సోదరుల బాధితుడు మాణిక్యరావు ఫిర్యాదును మంగళగిరి గ్రామీణ పోలీసులు స్వీకరించారు. డీజీపీ ఆదేశాల మేరకు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని తెదేపా కార్యకర్త, పోలింగ్ రోజు కండ్లకుంటలో ఏజెంటుగా వ్యవహరించిన నోముల మాణిక్యరావు ఆందోళన వ్యక్తం చేశారు. తనను చంపడానికి కండ్లకుంటకు చెందిన బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డి, పిన్నెల్లి వెంకటరెడ్డి, పిన్నెల్లి వెంకట లక్ష్మారెడ్డి, మోదుగుల వెంకటరెడ్డిని వారు నియమించారని వాపోయారు. ప్రస్తుత పరిస్థితిలో తాను మాచర్ల వెళ్లే పరిస్థితి లేదని, తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఈ మేరకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు తెదేపా నేత వర్ల రామయ్య, న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ తదితరులతో కలిసి వినతిపత్రం అందజేశారు. మంగళగిరి గ్రామీణ పోలీసులు జీరో ఎఫ్ ఐఆర్ నమోదు చేయడానికి వెనకాడుతున్నారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత డీజీపీ గుంటూరు ఎస్పీకి, ఆయన స్థానిక పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంతో...మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ ను వెల్దుర్తి ఠాణాకి పంపిస్తామని ఎస్ఐ చెప్పారు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке