Vedam Bevvani - Annamayya Sankeerthana (వేదం బెవ్వని - అన్నమయ్య సంకీర్తన) lyrics

Описание к видео Vedam Bevvani - Annamayya Sankeerthana (వేదం బెవ్వని - అన్నమయ్య సంకీర్తన) lyrics

వేదం బెవ్వని - అన్నమయ్య సంకీర్తన (Vedam Bevvani - Annamayya Sankeerthana)

Singer - S V Ananda Battar garu
Lyrics -
వేదం బెవ్వని వెదకెడిని
ఆదేవునిఁ గొనియాడుఁడీ

అలరిన చైతన్యాత్మకుఁ డెవ్వఁడు
కలఁ డెవ్వఁ డెచటఁ గలఁడనిన
తలఁతు రెవ్వనినిఁ దనువియోగదశ
యిల నాతని భజియించుఁడీ

కడఁగి సకలరక్షకుఁడిం దెవ్వఁడు
వడి నింతయు నెవ్వనిమయము
పిడికిట తృప్తులు పితరులెవ్వనినిఁ
దడవిన, ఘనుఁడాతనిఁ గనుఁడీ

కదిసి సకలలోకంబులవారలు
యిదివో కొలిచెద రెవ్వనిని
త్రిదశవంద్యుఁడగు తిరువేంకటపతి
వెదకి వెదకి సేవించుఁడీ

English Lyrics
---------------------
Vedam bevvani vedakedini
Aa devuni goniyadudi

Alarina chaitanyatmaku devvadu
Kala Devva dechata galadanina
Thalatu revvanini danuviyogadasha
Yila naatani bhajiyinchudi

Kadagi Sakalarakshakudim devvadu
Vadi ninthayu nevvanimayamu
Pidikita trupthulu pitaru levvanini
Dadavina ghanudathani ganudi

Kadhisi sakalalokambulavaaralu
Yidhivo kolichedha revvanini
Tridashavandyudagu Tiru Venkatapathi
Vedaki vedaki sevinchudi

భావామృతం :
వేదము భారతీయ తత్వజ్ఞానమునకు ప్రమాణము. ఆవేదము ఎవరిని కనుగొనుటకుయత్నించుచున్నది? ఆ వేదములు కనుగొనుటకు యత్నించుచున్న పరమాత్మను మీరందరు కీర్తించండి.
జీవులందరిలోను చేతన కారుకుడైన చేతనాత్మకుడుఎవ్వవు? ఆయన ఎక్కడనున్నాడు. ఏమి సమాధానమీయగలము? తాము తుదిశ్వాస విడుచునప్పుడు ఎవనిని స్మరించుటకు మానవులందరూ యత్నింతురు? ఆ పరమాత్ముని నేను భజియించెదును.
సకల లోకములకు ఏకైక రక్షకుడు ఎవ్వరు? సృష్టి అంతా ఎవ్వనిమయమై యున్నది? పితృదేవతలందరూ అనురాగముతో తాకబడి ఎవని చేత తృప్తి పరుచబడుచున్నారు? ఘనుడైన ఆ మహానుభావుని దర్శించండి.
సమీపించి ఎల్లలోకములవారు పూజించునదెవ్వరిని? త్రిదశలు మాత్మమే (బాల్యము, యౌవనము, కౌమారము అను మూడు దశలు మాత్రమే) గల దేవతలచే నుతించబడుచున్న శ్రీ వేంకటేశ్వరుని! వెదకి కనుగొని సేవించండి
ఓ ప్రజలార ఆవిధంగా అందరూ ధన్యులవండి.
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)

Комментарии

Информация по комментариям в разработке