వరిలో కలుపును సులభంగా నివారించవచ్చు || Weed control in Dry Direct Seeded rice || Karshaka Mitra

Описание к видео వరిలో కలుపును సులభంగా నివారించవచ్చు || Weed control in Dry Direct Seeded rice || Karshaka Mitra

Join this channel to get access to perks:
   / @karshakamitra  
వరిలో కలుపును సులభంగా నివారించవచ్చు || Weed control in Dry Direct Seeded rice || Karshaka Mitra
Important weeds of Rice || best management practices for weed control || Karshaka Mitra

వరిలో పెరిగే ముఖ్యమైన కలుపు మొక్కలు || కలుపును భస్మం చేసే రసాయనాలు

ప్రధాన ఆహారపంట అయిన వరి పంటలో సంప్రదాయ సాగు పద్ధతులతో ఖర్చు పెరిగిపోతుండటం, కూలీల కొరత ఎక్కువ అవటంతో చాలామంది రైతులు విత్తనం వెదబెట్టే పద్ధతిని అవలంభిస్తూ, ఆరుతడిగా వరి పండించే సాగు విధానానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఈ విధానంలో నాటిన 30 రోజుల వరకు కలుపు సమస్య తీవ్రంగా వుండటం, కలుపు నాశనుల పట్ల చాలామంది రైతులకు సరైన అవగాహన లేకపోవటం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపధ్యంలో వరిని ఆశించే కలుపు మొక్కలు ఎన్ని వున్నాయి, ఏ కలుపుకు ఏ మందు పనిచేస్తుంది. పైరు ఏ దశలో కలుపును మందులు వాడాలి వంటి అంశాలపై కర్షక మిత్ర దృష్టి సారించింది.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం, వీర్లపాలెం గ్రామంలో రైతులు గత 10 సంవత్సరాలుగా వరి పంటను వెద పద్ధతిలో సీడ్ డ్రిల్ సహాయంతో విత్తనం విత్తి పండిస్తున్నారు. నాటిన 20 రోజుల వరకు నీటి తడులు అందించరు కనుక వరితో పోటీపడే కలుపు మొక్కల నివారణకు శక్తివంతమైన కలపు నాశనులు ఉపయోగిస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రధానంగా తుంగ, ఊద కలుపు మొక్కలతోపాటు, పుల్లవిరుపు గడ్డి, గుంట గరిడాకు, చిప్పెర, గణుపుల గడ్డి వంటి కలుపు మొక్కలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకే పొలంలో సన్నజాతి, వెడల్పాకు మొక్కలు ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక రైతులు ఒకే మందుపై ఆధారపడకుండా రెండు మూడు రకాల మందులను కలిపి పిచికారిచేయటం ద్వారా కలుపును సమర్థవంతంగా అరికడుతున్నారు.
కలుపును ఏ విధంగా గుర్తించాలి, ఏ కలుపుకు ఏ మందును వాడాలి వంటి అంశాల గురించి వీర్లపాలెం గ్రామ అభ్యుదయ రైతు ఆళ్ల మోహన్ రెడ్డి ద్వారా ఈ స్టోరీలో తెలుసుకుందాం.

గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.



YOUTUBE:-    / karshakamitra  
FACEBOOK:-   / karshakamitratv  
TWITTER:-   / karshakamitratv  
TELEGRAM:- https://t.me/karshakamitratv

#karshakamitra #weedcontrolinpaddy #typesofweedsinpaddy #directseededrice #paddycultivation

Комментарии

Информация по комментариям в разработке