Supreme Court welcomes 10% . for EWS-5% reservation for Kapus revised State Govt.Akula Rama krishna

Описание к видео Supreme Court welcomes 10% . for EWS-5% reservation for Kapus revised State Govt.Akula Rama krishna

ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ను సుప్రీంకోర్టు స్వాగతించింది-కాపులకు కేటాయించిన 5% రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం పునర్దించాలి
కాపు రిజర్వేషన్ ప్రయోజనాలు కాపాడాలి

కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ డిమాండ్

రావులపాలెం : కొత్తపేట నియోజక వర్గం రావులపాలెం మండలంలో కాపు కళ్యాణ మండపంలో కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ
సుప్రీంకోర్టు ఇచ్చిన 10% ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ ఇచ్చిన తీర్పుకు స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా కాపులకు ఇచ్చిన 5% రిజర్వేషన్ పునర్దించాలని ప్రభుత్వాన్ని కోరారు.
కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% రాజ్యాంగ బద్ధమే
కాపులు తెలగ బలిజ ఒంటరి కులాలకు 5% రిజర్వేషన్ ఇవ్వకపోవడం వల్ల ఈ జాతి సుమారు మీరు చెబుతున్న నాలుగు లక్షల ఉద్యోగాల్లో 20 వేల ఉద్యోగాలు కోల్పోయారని.
అనేక ఉన్నత విద్య అవకాశాలు కోల్పోయారని.
గతంలో సబ్సిడీలపై రుణాలు ఇచ్చేవారు రెండు లక్షల రూపాయల సదుపాయానికి ఒక లక్ష రూపాయలు సబ్సిడీ కల్పించారు. ఇప్పుడు రుణాలు ఇవ్వడం లేదు.

127 రాజ్యాంగ సవరణ ప్రకారం బీసీ రిజర్వేషన్ రాష్ట్ర పరిధిలోని అంశమే అని కేంద్రం రాతపూర్వకంగా ఇచ్చింది.

కాపు తెలగ బలిజ ఒంటరి కులాలకు బీసీ రిజర్వేషన్ కల్పించాలి

ఏటా మీరు ఇస్తానన్న రెండు వేల కోట్లు ఇవ్వడం లేదు

నవరత్నాల పేరిట ఇస్తున్న సదుపాయాలన్నీ లెక్కించి చెబుతున్నారు. ఇంకా రేషన్ కార్డులు ద్వారా బియ్యం ఇతర ఆహార ధాన్యాలు ఉచిత పథకాల పేరిట ఇస్తున్న సబ్సిడీ
ఉచిత విద్యుత్ పేరిటి ఇస్తున్న సబ్సిడీ ఇతర ఇతర రకరకాల పథకాలను కూడా లెక్కలేస్తే మీరు ప్రకటించిన 27 వేలకోట్ల కాదు 30 వేల కోట్లు దాటవచ్చు అని చెప్పవచ్చు

గత ప్రభుత్వ హయాంలో అనుమతులు ఇచ్చిన కాపు సంక్షేమ భవనాలను సుమారు రాష్ట్రవ్యాప్తంగా 500 వరకు ఉన్నాయి ఇవి అసంపూర్తిగా ఉన్నాయి వాటిని పూర్తి చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది.

గత ప్రభుత్వ హయాంలో విద్యాధీన కింద ఇచ్చిన ప్రభుత్వ సహాయం పది లక్షలకు ఐదు లక్షలు వచ్చినవి కొందరికి లెటర్లు ఇచ్చి పది లక్షలు ఇవ్వలేదు వారందరికీ సహాయం అందించాలని కోరుచున్నాము.
రైతులకు కులం లేదు అగ్రవర్ణ పేద రైతులకు రైతు భరోసా ఇవ్వకపోవడం వల్ల పేద కాపు రైతులు నష్టపోతున్నారు.
రైతు భరోసా పథకం పేద రైతులందరికీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రావులపాలెం మండల కాపు సంఘం అధ్యక్షులు సాధనల శ్రీనివాసరావు కాపు సంఘం సెక్రటరీ ఆకుల భీమేశ్వరరావు కాపు జిల్లా జేఏసీ నాయకులు సాధనాల సత్యనారాయణ కాపు సంఘం డైరెక్టర్ సిద్ది రెడ్డి శ్రీనివాసరావు కాపు సంఘం డైరెక్టర్ పసుపులేటి రాధాకృష్ణ కాపు స్వామి డైరెక్టర్ కేశి రెడ్డి నాని కాపు సంఘం డైరెక్టర్ కాకుమళ్ల సత్తిబాబు కాపు యువజన సంఘం నాయకులు అంబటి మణికంఠ సాధన శివకుమార్ కొమ్మన్న శ్రీరామ స్వామి కేశిదిలీప్ మరియు కాపు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

Комментарии

Информация по комментариям в разработке