కొడంగల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో రేపు ఆదివారం నిర్వహించే మనస్మృతి

Описание к видео కొడంగల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో రేపు ఆదివారం నిర్వహించే మనస్మృతి

వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో రేపు ఆదివారం నిర్వహించే మనస్మృతి దహన కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ ఓ బీసీ మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు సూర్య నాయక్ ,ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ హక్కుల పోరాట సమితి ఉపాధ్యక్షులు చంద్రయ్య ,సిఐటియు జిల్లా అధ్యక్షులు బుస చంద్రయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కోడంగల్ పట్టణ కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. పైన పేర్కొన్న సామాజిక వర్గాల ప్రజలను ఎదగనీయకుండా దోహదం చేసిన మన స్మృతిని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 1927లో డిసెంబర్ 25న ఢిల్లీలో నడిరోడ్డులో తగలబెట్టడం జరిగిందన్నారు. కావున రేపు పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో మనస్మృతి దహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.
కాబట్టి ఇట్టి కార్యక్రమాన్ని పలుకుల సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు ప్రజాసంఘాల నాయకులు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ సామాజిక వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

Комментарии

Информация по комментариям в разработке