సాయి పాదాల నుండి శిరస్సు వరకు సేవా భాగ్యాన్ని పొందిన నిమోన్కర్ కుటుంబం అనుభవిస్తున్న అదృష్టం.Ep 1260

Описание к видео సాయి పాదాల నుండి శిరస్సు వరకు సేవా భాగ్యాన్ని పొందిన నిమోన్కర్ కుటుంబం అనుభవిస్తున్న అదృష్టం.Ep 1260

Sai Gurukulam Episode1260 // సాయి పాదాల నుండి శిరస్సు వరకు సేవా భాగ్యాన్ని పొందిన నిమోన్కర్ కుటుంబం అనుభవిస్తున్న అదృష్టం .

మూడున్నర మూరల పొడవు మనుష్యునివలె సాయిబాబా గాన్పించినను వారి అందరి మనములం దుండెడివారు. అంతరంగమున నిర్వామోహులు నిస్పృహులై నప్పటికి, బహిరంగముగా బాబా లోకులమేలుకోరువారు వానిగ గనిపించువారు. లోలోపల వారి కెవరియందును అభిమాన ముండెడిది కాదు. కాని బయటికి కోరికల పుట్టయన్నట్లు కనిపించువారు. అంతరంగమున శాంతమునకు ఉనికి పట్టయినను చంచల మనుష్కునివలె గనిపించుచుండెను. లోపల పరబ్రహ్మస్ధితి యున్నప్పటికి బయటకు దయ్యమువలె నటించుచుండెడివారు. లోపల యద్వైతి యైనను బయటకు ప్రపంచమునందు తగుల్కొనిన వానివలె గాన్పించు చుండెను. ఒక్కొక్కప్పుడందరను ప్రేమతో చూచెడివారు. ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు విసరుచుండిరి. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టు చుండిరి. ఇంకొకప్పుడు వారిని కౌగిలించుకొని నెమ్మదిగాను ఓరిమితోను చంచలము లేనివానివలెను గనిపించుచుండెను.

వారెల్లప్పుడు ఆత్మానుసంధానమందే మునిగియుండెడివారు; భక్తులపై కారుణ్యమును జూపుచుండెడివారు. వారెల్లప్పుడు నొకే యాసనమందు కూర్చుండువారు; ప్రయాణములు చేసెడివారు కారు. వారి దండము చిన్న పొట్టి కర్ర; దానిని సదా చేతిలో నుంచుకొనెడివారు. ఇతరమైన యాలోచనలేమియు లేక యెప్పుడు శాంతముగా నుండువారు. ఐశ్వర్యమును గాని, పేరు ప్రతిష్ఠలను గాని లక్ష్యపెట్టక భిక్షాటనముచే జీవించెడువారు. అట్టి జీవితము వారు గడిపిరి. ఎల్లప్పుడు 'అల్లా మాలిక్' యనెడివారు. భగవంతుడే యజమాని యని దాని భావము. భక్తులయందు సంపూర్ణప్రేమ కలిగి యుండెడివారు. ఆత్మజ్ఞానమునకు ఉనికిపట్టుగాను, దివ్యానందమునకు పెన్నిధిగాను గనుపించుచుండువారు. ఆద్యంతములు లేని యక్షయమైనట్టి, భేదరహితమై నట్టిది బాబాయొక్క దివ్యస్వరూపము. విశ్వమంతయు నావరించిన ఆ పరబ్రహ్మమూర్తియే షిరిడీ సాయి యవతారముగా వెలసెను. నిజముగా పుణ్యులు, అదృష్టవంతులు మాత్రమే యా నిధిని గ్రహించ గలుగుచుండిరి. సాయిబాబా యొక్క నిజమైనశక్తిని కనుగొనలేనివారు, బాబాను సామాన్యమానవునిగా నెంచినవారు, ఇప్పటికి అట్లు భావించు వారు దురదృష్టవంతులని చెప్పవచ్చును.

Комментарии

Информация по комментариям в разработке