Srikalahasti Famous Nethi Karam Dosa | 44 Years Famous Dosa |Swamy Hotel | Srikalahasti | Food Book

Описание к видео Srikalahasti Famous Nethi Karam Dosa | 44 Years Famous Dosa |Swamy Hotel | Srikalahasti | Food Book

స్వాగతం.. నమస్కారం.. నా పేరు లోక్ నాధ్.

నాణ్యత, రుచితో కూడిన అల్పాహారాలను తయారు చేసి ఆత్మీయత రంగరించి అందిస్తారు స్వామి గారిగా శ్రీకాళహస్తి లో సుపరిచితులైన వి.టీ
కృష్ణ మాచార్యులు గారు.కనుకనే 44 ఏళ్ల విశిష్టతతో ఘన కీర్తిని పొందింది వారి ఆహారశాల.ఇంటి తరహా ఆహారం మరియు వాతావరణం,స్వామి గారి ఆప్యాయత వెరసి ఇక్కడి కీ విచ్చేసే వారు ఆహారాశాల కు వచ్చామన్న సంగతి మరిచిపోతారు. తమ స్వగృహానీకో లేదా బంధువులు ఇంటికో వచ్చామన్న భావనలో మమేకమై తమకు ఇష్టమైన ఆహారాన్ని ఆరగించి ప్రాప్తత వ్యక్తం చేసి తిరిగి పయనమవుతారు.

సాంప్రదాయ అల్పాహారాల సహజ రుచుల ఆస్వాధనకు స్వామి గారి ఆహారశాల నిలయం.
ఇక్కడ అల్పాహారాలు రుచి శుచితో ఆరిగించిన వారు సంతృప్తి వ్యక్తపరిచే స్వభావం.

వారి వద్ద లభించు అల్పాహారాలలో ప్రాముఖ్యమైన నేతి కారం దోశ .
అరిటాకులో మనకు అందించిన ఈ ఉపాహారం
శోభితంగా వీక్షణానికి ఇంపుగా ఉంటుంది. నేతి పరిమళాన్ని వెదజల్లి చూడగానే నోరూరిస్తుంది.వారు ఇచ్చిన పచ్చళ్ళును దోశకు అలా అద్దుకుని నోటికి అందించగానేఅద్భుతమైన రుచిగల అనుభూతి మనకు కలుగుతుంది.

ఇక ఊతప్పం..
నా ఆహార విహారానా ఇంత రుచి గల ఊతప్పం నాకు తరుసు పడలేదు.తమదైన సూత్రీకారణతో తయారీ,ముడి పదార్థాల వినియోగంలో వైవిధ్యంతో తిన్నవారు మెచ్చే విధంగా ఈ అల్పాహారాన్ని తీర్చిదిద్ది నేతిలో వేయించిన ఎండు ద్రాక్ష, జిడిపప్పులను అలా విరజల్లి ఇలా మనకు అందిస్తారు అలా నోటికి స్వీకరించగానే జిహ్వమ్ వ్యక్తం చేసే భావం కమ్మని ఆస్వాధనాపూరితం.

Комментарии

Информация по комментариям в разработке