Sulthana puram Eetha Neera ( Alampur )

Описание к видео Sulthana puram Eetha Neera ( Alampur )

Eetha Neera: తేనెటీగలు పువ్వుల మకరందాన్ని పీల్చి తేనెను తయారు చేస్తాయి. ఈ మకరందం చెట్టు నుంచి తీయగలిగితే అది నీరా అవుతుంది. నీరా అనేది సాధారణంగా పామే కుటుంబ చెట్ల నుంచి సేకరిస్తారు. మన ప్రాంతంలో తాటి చెట్లు, ఈత చెట్లు విరివిగా ఉంటాయి. కాబట్టి వీటి నుంచే నీరా అనేది ఉత్పత్తి అవుతుంది. సాధారణంగా తాటి చెట్లు, ఈత చెట్ల నుంచి తెల్లని ద్రవం విడుదలవుతుంది దీనినే కల్లు అంటారు. తాటి నుంచి వస్తే తాటికల్లు, ఈత చెట్టు నుంచి ఉత్పత్తి అయినది ఈత కల్లు అవుతుంది. అయితే ఇక్కడ నీరా అనేది ఈ కల్లు ఏర్పడకంటే ముందు తీసే మరింత స్వచ్ఛమైన ద్రవం. నీరాను తీసేటపుడు గీతా కార్మికులు పూర్తిగా చెట్టును శుభ్రం చేసి, దీనికోసం ప్రత్యేకమైన మట్టి కుండను కట్టి, సూర్యోదయానికి మునుపే సేకరిస్తారు. ఇది చూడటానికి కొబ్బరి నీళ్లలా కనిపిస్తుంది. రుచిలో సహజంగానే తియ్యగా ఉంటుంది. ఇందులో ఆల్కాహాల్ అనేది ఉండదు. కాబట్టి దీనిని ఎవరైనా తాగొచ్చు, ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. నీరా తాగటం చాలా ఆరోగ్యకరం అని గ్రామీణ ప్రాంతాల్లో నమ్ముతారు.

Комментарии

Информация по комментариям в разработке