Farmer Training on Natural, Organic Farming | May 12, 2019 | Hyderabad | Entry Free | Rythunestham

Описание к видео Farmer Training on Natural, Organic Farming | May 12, 2019 | Hyderabad | Entry Free | Rythunestham

#Rythunestham #NaturalFarming #OrganicFarming

వ్యవసాయంలో నష్టాలు తగ్గి లాభాలు పొందాలంటే
పంటల సాగు విధానాలు మారాలి

తక్కువ పెట్టుబడి, భూమిని రక్షించే
వ్యవసాయ పద్ధతులని అవలంబించాలి

రైతుకి, పర్యావరణానికి మేలు
సుస్థిర ఆదాయం కల్పించే పద్ధతులే
ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానాలు

మరి ఈ సాగులో సాగేదెలా ?
కషాయాలు, మిశ్రమాల తయారీ, వాడకం ఎలా ?

ఇలా అనేక అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతునేస్తం ఫౌండేషన్ ఏర్పాటు చేస్తోంది.. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానంలో వివిధ పంటల సాగు, వివిధ కషాయాలు, మిశ్రమాల తయారీ, వాడకంపై రైతు శిక్షణా కార్యక్రమం. మే 12న ఆదివారం హైదరాబాద్ లక్డీకపూల్ రెడ్ హిల్స్ లోని ఫ్యాప్సీ KLN ప్రసాద్ ఆడిటోరియం హాల్ లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ డాక్టర్ శ్యాం సుందర్ రెడ్డి, కర్నూలుకి చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు కృష్ణ, నాగర్ కర్నూల్ కి చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు లావణ్యా రమణా రెడ్డి, కడపకు చెందిన సిరిధాన్యాల సాగు నిపుణులు విజయ్ కుమార్, వ్యవసాయశాఖ మాజీ అదనపు సంచాలకులు కె. రామచంద్రం, ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విధానంలో వివిధ పంటల సాగు విధానాలను, భూసార పరీక్షల ఆవశ్యకత, కలిగే ప్రయోజనాలను వివరిస్తారు. అందులో ఉపయోగించే కషాయాలు, మిశ్రమాల తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా చేసి చూపిస్తారు. కషాయాలు, మిశ్రమాలను వాడే పద్ధతులను తెలియజేస్తారు. కార్యక్రమానికి హాజరైన వారికి చిరుధాన్యాలతో తయారు చేసిన భోజనం కలదు.

ఈ రైతు శిక్షణా కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 7093 973 999, 9849 312 629 ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు.

Комментарии

Информация по комментариям в разработке