Sri Pothuluri Veera Brahmendra Swamy Pouranikam Madhav pally Part-III

Описание к видео Sri Pothuluri Veera Brahmendra Swamy Pouranikam Madhav pally Part-III

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నాటకం-మాధవ్ పల్లి


SM Photography is a Telugu and Hindi Photography channel including photography and cinema basics, tips and tricks, camera and lens

We can do wedding photography, fashion photography, photoshoots and portrait photography.
#babyshoots
#preweddingshoots
#candidvideo
Album Designing
4k Video Editing
Follow me
►  / solanki.baburao  
►  / sm_photography.official  
►  / smart_photography.official  
►   / sm   photography8121/

గంగానదీతీరంలో బ్రహ్మాండపురవాసులైన విశ్వబ్రాహ్మణ పుణ్యదంపతులైన పరిపూర్ణయాచార్యులు, ప్రకృతాంబల సంతానార్ధులై కాశీయాత్ర చేశారు. కాశీనగరంలో శివుడు కలలో కనిపించి విష్ణువు ఆమెకు కుమారుడుగా జన్మిస్తాడని చెప్పాడు. పకృతాంబ గర్భధరించింది. నవమాసాలు నిండుతున్న సమయంలో స్వగ్రామానికి బయలుదేరగా, సరస్వతీనదీసమీపంలో మగబిడ్డను స్వస్తీశ్రీ చాంద్రమానేన కీలక నామ సంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశినాడు ప్రసవించింది. [1] మరుసటిరోజు పరిపూర్ణయాచార్యులు కాలధర్మం చేశారు. ప్రకృతాంబ సమీపంలోని అత్రి మహాముని ఆశ్రమంలో చేరుకుని తనబిడ్డను పెద్దవాణ్ణిచేయమని కోరి తనూ తనువుచాలించింది. కర్ణాటక లోని స్కందగిరి పర్వతసానువులో స్థితమైన పాపాఘ్ని మఠాధిపతులు (ప్రస్తుతం ఇది చిక్‌బళ్లాపూర్ జిల్లా లోని కళవారహళ్లిలో ఉన్నది) అయిన విశ్వబ్రాహ్మణ పుణ్యదంపతులు యనమదల వీరభోజయచార్యులు, వీరపాపమాంబ సంతాన భాగ్యం కోసం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ అత్రి మహాముని ఆశ్రమం చేరుకుంటాడు. సంతాన ప్రాప్తి కై పరితపిస్తున్న ఆ పుణ్య దంపతుల చెంతకు, దైవ స్వరూపులు అయిన బ్రహ్మన్ని అత్రి మహాముని అందజేస్తాడు. "వీరభోజయాచార్య.. ఈ బాలుడు మహా మహిమాన్వితుడు, మునుముందు, ఈ బాలుడు ఎన్నో వింతలు చూపించబోతున్నాడు" అంటూ ఆ బాలుని వీరభోజయాచార్య దంపతులకు అందజేస్తాడు. ఆ పిల్లవాడు వీరప్పయాచార్యులు గా పాపాఘ్ని మఠాధిపతి గారింట సనాతన సంప్రదాయాల నడుమ పెరుగుతూ వస్తాడు. (ఈనాడు కర్ణాటక లోని పాపాఘ్ని మఠం బ్రహ్మం గారి ప్రథమ మఠంగా పేరు గాంచి దివ్య క్షేత్రంగా వెలుగొందుతున్నది). అతి చిన్న వయసులోనే, బ్రహ్మం గారు కాళికాంబ పై సప్తశతి రచించి అందరిని అబ్బురపరుస్తాడు. బ్రహ్మం గారి పదవ ఏట వీరభోజయచార్యులు స్వర్గాస్తులవుతాడు. అటు పిమ్మట దేశాటన నిమిత్తమై బయలుదేరబోతు తన తల్లి ఆశీర్వాదాలు కోరతాడు. అందుకు, వారి తల్లి, నాయన, వీరంభోట్లయ్య (బ్రహ్మం గారు చిన్న నాడు వీరంభోట్లయ్యగా పిలువబడ్డారు, పాపాఘ్ని ప్రస్తుత మఠాధిపతుల వద్ద దీనికి సంబంధించి శాసనాలు ఉన్నాయి), మఠాధిపత్యం స్వీకరించవలసిన నీవు ఇలా తల్లిని వదిలి పెట్టి దేశాటనకు బయల్దేరితే ఎలాగంటూ శోక సంద్రంలో మునిగి పోతుంది. పుత్రుని మీద ఉన్న మమకారం కారణంగా ఆమె అనుమతిని నిరాకరించగా ఆమెను అనేక విధాలుగా అనునయించి జ్ఞానభోద చేశాడు. ఆ సందర్భంలో ఆయన పిండోత్పత్తి జీవి జన్మ రహస్యాలను తల్లికి చెప్పి అనుబంధాలు మోక్షానికి ఆటంకమని దానిని వదలమని తల్లికి హితవు చెప్పాడు. శరీరం పాంచభౌతికమని ఆకాశం, గాలి, అగ్ని, పృధ్వి, నీరు అనే అయిదు అంశాలతో చేయబడిందని సమస్త ప్రకృతితో కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము అనే జ్ఞానేంద్రియాలద్వారా సంబంధం ఏర్పరచుకొని జ్ఞానం సంపాదిస్తామని, వీటి ద్వారా 'నేను' అనే అహం జనిస్తుందని, ఆత్మ సాక్షిగా మాత్రమే ఉంటుందని, బుద్ధి జీవుని నడిపిస్తుందనీ, బుద్ధిని కర్మ నడిపిస్తుందని, దానిని తప్పించడం ఎవరికీ సాధ్యపడదనీ, ఈ విషయాన్ని గ్రహించి ఎవరు పరబ్రహ్మను ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని బోధించి ఆమె వద్ద సెలవు తీసుకుని దేశాటనకు బయలుదేరాడు.

Комментарии

Информация по комментариям в разработке