Megha Engineering to Build Young India Skills University in Hyderbad with ₹200Cr Under CSR

Описание к видео Megha Engineering to Build Young India Skills University in Hyderbad with ₹200Cr Under CSR

రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి మెగా ఇంజనీరింగ్ ఇన్ ఫాస్ట్రక్చర్ లిమిటెడ్... కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద 200 కోట్లు కేటాయించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మెఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలో ఆ కంపెనీ ప్రతినిధుల బృందం సంప్రదింపులు జరిపింది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో స్కిల్స్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ శివార్లలో కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో సీఎం చేతుల మీదుగా ఆగస్టులోనే యూనివర్సిటీ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. క్యాంపస్ నిర్మాణానికి మెఘా కంపెనీ ముందుకు రావడం పట్ల ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఆర్కిటెక్ట్ నిపుణులతో తయారు చేయించిన భవన నమూనాలు, డిజైన్లను ప్రదర్శించారు. వారంలోగా భవన డిజైన్లకు తుది రూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. నవంబర్ 8నుంచి నుంచి విశ్వవిద్యాలయం భవన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని స్పష్టం చేశారు...VIS
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке