బుట్టలో చిక్కుకున్న ఎలుక నీతి కథ | The rat trapped in the basket Moral stories | RSK Telugu stories

Описание к видео బుట్టలో చిక్కుకున్న ఎలుక నీతి కథ | The rat trapped in the basket Moral stories | RSK Telugu stories

బుట్టలో చిక్కుకున్న ఎలుక నీతి కథ | The rat trapped in the basket Moral stories | RSK Telugu stories

#బుట్టలోచిక్కుకున్నఎలుకనీతికథ #Telugumoralstories #bedtimestories

********** బుట్టలో చిక్కుకున్న ఎలుక **************
ఒకసారి కలుగులోంచి రెండు ఎలుకలు బయటకు వచ్చాయి. అవి బాగా ఆకలితో వున్నాయి. తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని దగ్గరలోని పొలంలో వెతకసాగాయి. అవి ఎంత సేపు వెతికినా, అప్పటికే రైతులు పంటలను కోసేయడంతో.. ఏమీ దొరకక నిరాశగా వెనుదిరిగాయి.

అలా వెనక్కి వెళ్లి పోతున్న ఆ ఎలుకలను ఎగురుకుంటూ వెళ్తున్న కాకి చూసింది. అంతే, ఒక్కసారిగా కిందకి దిగి వాటిని వెంబడించసాగింది. దాని నుంచి తప్పించుకోవడానికి ఎలుకలు అడవిలో అటూ ఇటూ పరుగులు పెట్టాయి. చివరికి దూరంగా ఒక బుట్ట కనిపించడంతో అక్కడికి పరుగుతీసాయి. ఆ బుట్టకు వున్న చిన్న కన్నం ద్వారా వేగంగా దానిలోకి దూరిపోయాయి. వాటికోసం కొంత సేపు ఎదురు చూసిన కాకి, ఎలుకలు తప్పించుకున్నాయని గ్రహించి మళ్లీ ఆకాశంలోకి ఎగిరిపోయింది.

వాటి అదృష్టమో, ఏమోగానీ ఆకలితో అలమటిస్తున్న ఆ ఎలుకలకు బుట్టనిండుగా మొక్కజొన్న పొత్తులు కనిపించాయి. అంతే, వాటి ఆనందానికి అంతే లేదు.

" భలెభలే.. రుచికరమైన మొక్కజొన్న పొత్తులు .."
“అమ్మయ్య, వీటిని తిని ఆకలి తీర్చుకుందాం... ” అనుకుని ఎలుకలు బోకా బోకా పొత్తులు తినడం మొదలెట్టాయి.

అంత ఆకలి మీద వాటికి ఇలాంటి భోజనం దొరికేసరికి లొట్టలేసుకుని మరీ తిన్నాయి.
" హమ్మయ్యా.. ఇక చాలు.. మనం ఇంటికి బయలుదేరుదామా.. " అన్నది మొదటి ఎలుక..
" ఆ.. తొందర ఏముందీ.. నాకు ఆకలి తీరినా మనసుకు సరిపోలేదు. మళ్లీమళ్లీ ఇంతటి రుచికరమైనవి దొరుకుతాయా ఏంటీ.. నా నాలుక అయితే ఇంకా ఇంకా కావాలంటోంది.. కాసేపు ఆగు వెళదాం.." అన్నది రెండవ ఎలుక.
"చూడూ ..బయట మన శత్రువులు కూడా లేరు.. ఇటువంటి సమయంలోనే మనం మన స్దావరానికి చేరుకోవడం మంచిది."
'" నీకు అంతగా భయంవేస్తుంటే నీవు వెళ్ళులే.. నేను ఇంకొన్ని తినేసి వస్తాను.." అన్నది రెండవ ఎలుక.
ఇక చెప్పి ప్రయోజనం లేదని మొదటి ఎలుక కన్నం లోంచి బయటకు వచ్చి నెమ్మదిగా కలుగులోకి వెళ్లిపోయింది. రెండవ ఎలుక అయితే బుట్టలోపలేవుండి పొత్తులు తింటూనే వుంది. కొంచం సేపటికి దాని కడుపు ఉబ్బి, బద్దలయ్యే స్థితికి వచ్చింది. అప్పుడు తినడం ఆపింది.
" ఇంక చాలు, బయట పడదాము" అని ఎలుక కన్నం లోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేసింది.

లోపలికి వెళ్లినప్పుడు బాగానే వెళ్ళిన ఎలుక బయటికి మట్టుకు రాలేక పోయింది. ఎందుకంటే వెళ్ళే డప్పుడు సన్నంగా వుంది. ఇప్పుడు తిని, తిని, కడుపు ఉబ్బి చాలా లావయిపోయింది. ఆ కన్నంలో ఇంక పట్టటం లేదు.

“ఇప్పుడేంచేయాలీ?” అని కంగారు పడుతూ చాలా ఆలోచించింది.

అప్పుడే పక్క నుంచి ఒక తాబేలు వెళ్తుండటం గమనించింది. తాబేలుకి విషయం చెప్పి సహాయం అడిగింది.
“ఇంకేం చేస్తావు, తిన్నదంతా అరిగి, మళ్ళీ ఆకలితో పొట్ట తగ్గేదాకా ఆగు. అప్పుడు ఎలా అయితే వెళ్లావో అదే విధంగా సునాయాసంగా బయటి వస్తావు” అని సలహా ఇచ్చి వెళ్ళిపోయింది తాబేలు.

ఈ సారి తన చుట్టూరా తినడానికి మంచి రుచికరమైన పొత్తులు బోలెడు వున్నా, తినలేక బాధతో విలవిలలాడసాగింది. గోరు చుట్టుమీద రోకటి పోటులా అప్పుడే ఆ రైతువచ్చి బుట్టను నెత్తిమీద పెట్టుకుని ఇంటికి పయనమయ్యాడు. దాంతో ఇక తన పరిస్దితేంటో అర్ధంకాక ఆ ఎలుక పై ప్రాణాలు పైనే పోయాయి. తన మిత్రుడి మాటను విని వుంటే ఇంత కష్టం వచ్చేది కాదు కదా అని కన్నీళ్లు పెట్టుకుంది.

ఈ కథలో నీతి ఏమిటంటే..." అతి ఎప్పటికీ అనర్ధమే.. ఏదైనా అవసరానికి తగ్గట్టుగా ఉంటేనే మంచిది."

Комментарии

Информация по комментариям в разработке