అన్ని ప్రశ్నలకు సమాధానాలు డిస్క్రిప్షన్ లో ఉన్నాయి..

Описание к видео అన్ని ప్రశ్నలకు సమాధానాలు డిస్క్రిప్షన్ లో ఉన్నాయి..

1)వ్రతం చేసిన రోజు బ్రహ్మచర్యం పాటించాలా?
1) వ్రతం చేసిన రోజు మాత్రం బ్రహ్మచర్యం పాటించాలి భూమిపై నిద్రించాలి..
2) వ్రతం ముగిసే వరకు మాంసాహారం భుజించకూడదా?
2) 7 శనివారాలు ముగిసేవరకు మాంసం ఇంట్లో చేయకూడదు తినరాదు..
3) ఏటి సూతకం ఉన్నవాళ్లు ఈ వ్రతం చేయవచ్చా?
3) ఏటి సూతకం ముగిసే వరకు ఏ వ్రతములు చేయకూడదు.
4) 7 శనివారాలు చేస్తే చాలా 8వ వారం కూడా వడ్డీ కింద చేయాలా?
4) పురాణాల్లో సప్త శనివారాలు అంటే 7 శనివారాలు మాత్రమే చేయమని చెప్పారు మీకు వీలుంటే 8వ వారం కూడా పూజ చేసుకోండి కానీ వ్రతం 7 వారాలకు ముగిసిపోతుంది.
5) వ్రతం చేసేటువంటి సమయం లో ఏవైనా ఆటంకాలు వస్తే మొదటి నుండి చేయాలా?
5) అక్కర్లేదు ఆటంకం వచ్చినవారం విడిచిపెట్టి అక్కడ నుండి కంటిన్యూ చేయవచ్చు.
6) స్వామికి కట్టిన ముడుపు తిరుపతిలోనే చెల్లించాలా?
6) ఏడు శనివారాల ముగిసిన తక్షణము తిరుపతి కి వెళ్లి స్వామి దర్శనం చేసుకొని ముడుపు ఉండిలో సమర్పించాలి.
7) తిరుమల వెళ్లలేక పోతే దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో అయినా చెల్లించవచ్ఛా?
7) తిరుమలకు వెళితే చాలా మంచిది అది భూ వైకుంఠం వీలు లేకపోతే దగ్గర్లో ఉన్న వెంకటేశ్వర స్వామికి గుడికి వెళ్లి చెల్లించవచ్చు ఆయన సర్వాంతర్యామి ఎక్కడైనా ఉంటాడు.

Комментарии

Информация по комментариям в разработке