WEIGHING CLOTHES తూకానికి బ్రాండెడ్ బట్టలు..!

Описание к видео WEIGHING CLOTHES తూకానికి బ్రాండెడ్ బట్టలు..!

కూరగాయలు, పచారీ సరుకులు, కొన్ని చోట్ల పళ్లు కిలోల లెక్కన అమ్ముతుంటారు. అందులో పెద్ద వింతేమీ లేదు. కానీ బట్టలు తూకానికి అమ్మడం కాస్త వింత విషయమే. ఈ మధ్య కాలంలో కొన్ని పెద్ద షాపింగ్ మాల్స్ ఆషాడం, శ్రావణం ఆఫర్ల పేరుతో కిలో బట్టల సేల్స్ నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా చీరలను తూకం ఆధారంగా అమ్మడం మహిళా కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంది. అమ్మకాలు పెంచింది. షాపింగ్ మాల్స్ కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే కల్పిస్తున్న ఈ అవకాశం శ్రీకాకుళం నగరంలో నిత్యం అందుబాటులో ఉంటోంది. అది కూడా పురుషులు వాడే షూటింగ్స్, షర్టింగ్స్ బిట్ల రూపంలోనూ, తానుల్లోనూ లభిస్తున్నాయి. ఇవేవో చీప్ రకాలకు చెందినవనుకుంటే పొరపాటే. షియారామ్స్, అరవింద్, డెనిమ్ తదితర ప్రముఖ బ్రాండ్ల బట్టలన్నీ ఈ చిన్న షాపుల్లో కిలోల లెక్కన అమ్ముతారు. పెద్ద షాపులు, మాల్స్ లో బ్రాండెడ్ బట్టల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ షాపుల్లో అవే బట్టలు దాదాపు సగం ధరకే లభిస్తాయి. కస్టమర్ ఎంచుకునే బట్టలను తూకం వేసి వాటి బరువు ఆధారంగా ధర వసూలు చేస్తారు. ముంబై, సూరత్ వంటి ప్రాంతాల్లోని బట్టల మిల్లుల్లో మిగిలిపోయే చివరి ముక్కలను టోకుగా కొని తెచ్చి ఇక్కడ అమ్ముతుంటారు. శ్రీకాకుళంలో ఇటువంటి కిలో సేల్స్ బట్టల షాపులు 20 వరకు ఉన్నాయి. వీటిపై ఆధారపడి చాలా కుటుంబాలు జీవిస్తున్నాయి. కింద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఈ షాపుల్లో బట్టలు కొనుగోలు చేస్తున్నారు.

Комментарии

Информация по комментариям в разработке