అరిటాకు భోజనం | Traditional Food | Sai Charanam Aritaku Tiffins And Meals | Vijayawada | Food BooK

Описание к видео అరిటాకు భోజనం | Traditional Food | Sai Charanam Aritaku Tiffins And Meals | Vijayawada | Food BooK

పరవళ్లు తొక్కే ప్రకృతి సోయగాల ప్రవాహంలో అందాల అరవిందముపై సాగిన ఈ పయనం ఆహ్లాద ప్రమోదమైంది.దుర్గమ్మ దీవెనలతో, కృష్ణమ్మ ఆశీస్సులతో వివిధ రంగాల్లో ప్రఖ్యాతి గాంచిన విజయవాడ.మహా నగరంగా ఎదుగుతుంది.ఆంధ్ర ప్రదేశ్ నడిబొడ్డున ఉన్న ఈ పుణ్య పుడమితో రాష్ట్ర ప్రజలకు ఉన్న అనుబంధం విశిష్ఠమైనది.నా గమ్య గమనాన దిక్సూచి అయిన బెజవాడ నగరాన ప్రసిద్ధి చెందిన ఆహార పదార్థాలు గురించి కార్యక్రమాలు చిత్రీకరణ చేయాలన్నది నా చిరకాల కాంక్ష.కావున విజయవాడ రావడం నాకెంతో ఆనందాయకం.విజయవాడలోని గవర్నర్ పేటలో గల సాయి చరణం అరిటాకు భోజన శాల గూర్చి ఈ ప్రసారం. ఆహార శాల పేరు నేపధ్యానికి అనుగుణంగా ఇక్కడ అరిటాకులో ఆహార పదార్థాల వడ్డన చూస్తేనే తృప్తిగా ఉంటుంది.ఆహార నాణ్యత తెలియవస్తుంది. ఆకలిని మరింతగా పెంచుతుంది.ఇక్కడ ఆహార ఆస్వాధన నాకు ఓ జ్ఞప్తిగా ఉంటుంది.నిర్వాహకులు లీలా కృష్ణ ప్రసాద్ గారితో ముచ్చటిస్తూ భోజనం చేశాను. ఆహారం గురించి సవివరంగా మీతో పంచుకుంటాను కార్యక్రమ పరంపరలో.ముద్ద పప్పు,ఆవకాయ, నెయ్యి ఈ పద పొందిక ఎంత ఆత్మీయంగా ఉందొ.అవి కలగలిపి తిన్నప్పుడు ఆహారం అంతే అనురాగం అందించింది.ఫలం యొక్క పులుపుదనం రవ్వంత, పచ్చి మిరపకాయ కారం కాస్తంత అలా మామిడికాయ పప్పుతో సంప్రదాయ రుచి లభించింది.పులుపు లేకుండా బఠాని వినియోగంతో సద్గుణ రుచికర అనుభూతి పంచింది వంకాయ కూర.పచ్చి పులుసు,ముద్ద పప్పు,నెయ్యి ఈ ఆస్వాధన వర్ణనాతీతం ఆ కమ్మని రుచి మాటల్లో చెప్పలేం.పెరుగు పులుసులో పచ్చి మిరపకాయల వినియోగం మరింతగా లేకపోవడం నాకు బాగా నచ్చిన విషయం.చక్కని రుచి.సంపూర్ణ ఆస్వాధన కుండలో తోడు బెట్టిన కమ్మటి పెరుగుతో సొంతమైంది.

#foodbook
#vijayawada
#food

గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.

Комментарии

Информация по комментариям в разработке