River Electric Vehicle (EV) Store in Balanagar Hyderabad | EV Vehicle | Best EV Vehicle | h5tv

Описание к видео River Electric Vehicle (EV) Store in Balanagar Hyderabad | EV Vehicle | Best EV Vehicle | h5tv

River Electric Vehicle Store in Hyderabad

బెంగ‌ళూరుకు చెందిన విద్యుత్ వాహ‌నాల ఉత్ప‌త్తిదారు అయిన రివ‌ర్ సంస్థ‌.. నిజాంల న‌గ‌ర‌మైన హైద‌రాబాద్‌లో త‌న తొలి స్టోర్ ప్రారంభించింది. ఇండి స్కూట‌ర్లు, యాక్సెస‌రీలు, మెర్చండైజ్ లాంటి సేవ‌ల‌న్నింటినీ రివ‌ర్ స్టోర్‌లో అందించేందుకు వీలుగా ఈ స్టోర్‌ను సౌక‌ర్య‌వంతంగా తీర్చిదిద్దారు. కూక‌ట్‌ప‌ల్లిలో శ్రీ రాజ‌రాజేశ్వ‌ర ఈవీ మొబిలిటీ స‌హ‌కారంతో వెయ్యి చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఈ స్టోర్ ఉంది.

ఒకేసారి ప‌లువురు క‌స్ట‌మ‌ర్ల‌కు డెలివ‌రీ ఇస్తూ స్టోర్ ప్రారంభించే సంప్ర‌దాయాన్ని హైద‌రాబాద్‌లో కూడా ఈ బ్రాండు కొన‌సాగించింది. కూకట్ పల్లిలోని ఈ స్టోర్ లో నదుల సారాన్ని ప్రతిబింబించే 'ఫ్లో లైన్లు', గులకరాళ్లు, ఇతర సేంద్రియ ఆకృతులతో బ్రాండ్ యొక్క కొత్త సౌందర్యాన్ని కలిగి ఉంది. ఇండీ ఫీచ‌ర్ల‌కు త‌గిన‌ట్లుగా ఇక్క‌డి ప‌రిస‌రాల‌ను అత్యంత జాగ్ర‌త్త‌గా డిజైన్ చేశారు. ఈ స్కూట‌ర్ మీ రోజువారీ జీవితంలో ఎలా క‌ల‌గ‌లిసిపోతుందో ఈ స్టోర్ వివ‌రిస్తుంది. రివ‌ర్ బ్రాండు స్కూట‌ర్ ప్ర‌జ‌ల‌ను ఎక్క‌డినుంచి ఎక్క‌డికైనా వారు కోరుకున్న చోటుకు తీసుకెళ్తుంది. అంద‌రినీ స్వాగ‌తించేలా, శ‌క్తివంతంగా డిజైన్ చేసిన ఈ స్టోర్.. వాకిన్ క‌స్ట‌మ‌ర్లు, డెలివ‌రీ తీసుకునే క‌స్ట‌మ‌ర్ల‌కు ప్రత్యేక‌ అనుభవాలను అందిస్తుంది. ప్ర‌తి క‌స్ట‌మ‌ర్ త‌నకు సర్వీసు శ్రద్ధగా అందుతున్న అనుభూతి పొందుతారు. రివ‌ర్ బ్రాండ్ వాల్యూ నిజంగా జీవితంలోకి వస్తుంది.

స‌మీప భ‌విష్య‌త్తులోనే చెన్నై, కొచ్చి, కోయంబ‌త్తూరు, త్రివేండ్రం, అహ్మ‌దాబాద్, సూర‌త్, ముంబై, పుణె, నాగ్‌పూర్ లాంటి న‌గ‌రాల‌కు విస్త‌రించాల‌న్న యోచ‌న‌లో రివ‌ర్ సంస్థ ఉంది. ఈ సంవ‌త్స‌రాంతానికి భార‌త‌దేశంలోని 50కి పైగా న‌గ‌రాల్లో ఈ బ్రాండ్ ఉంటుంది.





#ev #electric #electricvehicle #electricvehicles #electricbike #evvehicle #h5tv #hyderabad #telangana

Комментарии

Информация по комментариям в разработке