కానిస్టేబుళ్లపై వేటు | Sacks on 2 Constables | Allu Arjun Campaign in Support of Shilpa Ravichandra

Описание к видео కానిస్టేబుళ్లపై వేటు | Sacks on 2 Constables | Allu Arjun Campaign in Support of Shilpa Ravichandra

వైకాపా నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతుగా నంద్యాలలో కథానాయకుడు అల్లు అర్జున్ ప్రచారం చేసిన ఉదంతంలో.....ఇద్దరు కానిస్టేబుళ్లపై పోలీసు ఉన్నతాధికారులు వేటు వేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నంద్యాల ఎస్పీతోపాటు పోలీసు ఉన్నతాధికారులను బాధ్యుల్ని చేసి మరీ ఆదేశాలు జారీ చేస్తే.. తప్పంతా కానిస్టేబుళ్లదే అయినట్లు వారిపై వేటు వేశారు. నాటి ఘటనలకు నంద్యాల రెండో పట్టణ ఎస్ బీ కానిస్టేబుల్ నాయక్, తాలుకా ఎస్ బీ కానిస్టేబుల్ నాగరాజులను వీఆర్‌కు పంపడం పోలీసుల్లో చర్చనీయాంశమైంది. ఈ నెల 11న అల్లు అర్జున్ నంద్యాల వచ్చిన సందర్భంగా ఎలాంటి అనుమతులూ తీసుకోకుండా భారీ ర్యాలీ నిర్వహించారు. నంద్యాల ఎమ్మెల్యే కూడా ఆ ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలో సెక్షన్ 30, 144లు అమల్లో ఉన్నప్పటికీ వేల మందితో ర్యాలీ నిర్వహించడం పెను దుమారాన్నే రేపింది. ఆ రోజు నంద్యాలలో ఎన్నికల కోడ్ ను అమలు చేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కొందరు ఫిర్యాదు చేయగా కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. నంద్యాల ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి, డీఎస్పీ ఎన్ .రవీంద్రనాథ్ రెడ్డి, సీఐ రాజారెడ్డిలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. వారిపై 60 రోజుల్లో శాఖాపరమైన విచారణ పూర్తిచేయాలని కూడా సూచించింది..
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке